salary increment
-
వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?
వచ్చే ఏడాది ఏ ఉద్యోగుల జేబులు నిండుతాయి.. ఏ రంగంలో జీతాలు ఎక్కువగా పెరుగుతాయి? దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 2025 ఏడాదిలో జీతాలు ఎంత మేర పెరుగుతాయన్న దానిపై ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే నిర్వహించింది.30వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2024-25 మొదటి దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో 40కి పైగా పరిశ్రమల నుండి 1,176 కంపెనీల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. దీని ప్రకారం 2025లో అన్ని రంగాల్లో సగటు వేతన పెంపు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కాగా ఈ ఏడాది వాస్తవిక పెంపు 9.3 శాతంగా ఉంది.డబుల్ డిజిట్ ఈ రంగాలదే..ఇంజనీరింగ్, తయారీ, రిటైల్ పరిశ్రమలు 2025లో అత్యధికంగా 10 శాతానికి పైగా వేతనాలు పెంచుతాయని అంచనా వేశారు. 9.9 శాతంతో తర్వాత స్థానంలో ఆర్థిక సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ సెక్టార్‌కు ఈ సంవత్సరం జాగ్రత్తగా ప్రారంభమైనప్పటికీ వచ్చే ఏడాది ఆశాజనకంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, టెక్నాలజీ ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్‌లు 9.9 శాతం, 9.3 శాతం వేతనాల పెంపును ఆశిస్తున్నాయి. అయితే టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ రంగ సంస్థలు 8.1 శాతమే ఇంక్రిమెంట్‌ను అందించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అధ్యయనం రెండో దశలో భాగంగా వచ్చే డిసెంబర్, జనవరిలో డేటాను సేకరించి 2025 ప్రారంభంలో వెల్లడించనున్నారు. -
ఐఏఎస్‌లకన్నా టీచర్లకే జీతాలెక్కువ!
భూటాన్ ప్రభుత్వం నూతన వేతన సవరణలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసింది. ప్రధాని లియోంచన్ లొటే సెరింగ్ నాయకత్వంలో వేతన సవరణపై ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో దేశంలో ఉపాధ్యాయులు, వైద్యుల వేతనాలు సివిల్ సర్వీసు ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువవుతాయి. ఇంతకుముందు ప్రతిభ ఆధారిత ప్రోత్సాహకాలిచ్చిన ప్రధాని సెరింగ్... తాజాగా విద్య, వైద్య సిబ్బంది వేతనాలను భారీగా పెంచారని భూటాన్ మీడియా వెల్లడించింది. తాజా పెంపు ప్రకారం పదేళ్లకన్నా తక్కువ అనుభవం ఉన్న టీచర్లకు 35 శాతం వృత్తి భత్యం ఇస్తారు. 10–20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి 45 శాతం, 20 ఏళ్లకు మించి సర్వీసు ఉన్న వారికి 55 శాతం వృత్తి భత్యం చెల్లిస్తారు. దీంతోపాటు భూటాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వృత్తిపరమైన ప్రమాణాల మేరకు వీరికి అనుభవాన్నిబట్టి 10 నుంచి 20 శాతం భత్యం అదనంగా లభిస్తుంది. అలాగే ఎంబీబీఎస్ డాక్టర్లకు 45 శాతం, స్పెషలిస్టులకు 55 నుంచి 60 శాతం వృత్తి భత్యం ఇస్తారు. నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అనుభవాన్నిబట్టి 35 నుంచి 55 శాతం భత్యం లభిస్తుంది. దీని ప్రకారం లెక్కేస్తే... పదేళ్ల అనుభవం ఉన్న టీచరు, పీ5 గ్రేడ్ డాక్టర్‌కు 29,935 గల్‌ట్రమ్ (ఎన్యూ–భూటాన్ కరెన్సీ) కంటే ఎక్కువ జీతం వస్తుంది. పీ3 సివిల్ సర్వీసు అధికారి జీతం 28,315 గల్‌ట్రమ్. ప్రభుత్వంలో డైరెక్టర్ హోదాలో ఉన్న ఐఏఎస్‌కు 44,120 ఎన్యూ వేతనం ఉంటే పీ2 గ్రేడ్ టీచర్, డాక్టర్ల జీతం 46,835 ఎన్యూలకుపైగా ఉంటుంది. భూటాన్ ప్రభుత్వంలో అత్యధిక వేతనం పొందే ఉద్యోగం కేబినెట్ సెక్రటరీ. ఆయనకు 82 వేలకుపైగా జీతం వస్తుంది. తాజా వేతన సరవణలో ఈఎస్1 గ్రేడ్ పొందిన డాక్టర్లు 90 వేలకుపైగా జీతం పొందుతారు. -
ఆర్టీసీలో మళ్లీ వేతన సవరణ రగడ
-
ఇన్ఫోసిస్‌లో వేతన పెంపు అంతేనా..!
బెంగళూరు : ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి వల్ల, ఇన్ఫోసిస్ వేతన పెంపును క్వార్టర్ పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాయిదా అనంతరం వేతన పెంపును కంపెనీ ఈ నెల నుంచి చేపట్టింది. సగటును ఉద్యోగుల వేతన పెంపును కంపెనీ 5 శాతం చేపట్టినట్టు తెలిసింది. ఇన్ఫోసిస్ ప్రత్యర్థి విప్రో కూడా ఇదే మేర పెంపును చేపడుతున్నట్టు వెల్లడైంది. జాబ్ లెవల్ 6 ఉద్యోగుల(మేనేజర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు), అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగుల సమీక్షించిన వేతన పరిహారాలు జూలై నుంచి అమల్లోకి వస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌లో కంపెనీ ఇంక్రిమెంట్లను చేపడుతుంటూంది. కానీ ఈ సారి ఇండస్ట్రీలో నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో కంపెనీ క్వార్టర్ కాలం పాటు ఇంక్రిమెంట్లను వాయిదా వేసింది. అయితే ఈ ఇంక్రిమెంట్లు గతేడాది కంటే తక్కువగా ఉన్నాయని తెలిసింది. గతేడాది 6-12 శాతం మధ్యలో ఇంక్రిమెంట్లను కంపెనీ ఆఫర్ చేసింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు(జాబ్ లెవల్ 7, అంతకంటే పైన) అసలు కంపెనీ ఇంక్రిమెంట్లనే చేపట్టడం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ ఐకౌంట్ ద్వారా వ్యక్తిగతంగా ఓ ఉద్యోగి సహకారం ఏ మేర ఉంటుందో తెలుసుకోవడం కోసం కంపెనీ ఎక్కువగా దృష్టిసారించింది. ఫీడ్‌బ్యాక్‌లను కూడా కంపెనీ నిరంతరం తీసుకుంటూనే ఉంది. కంపెనీలో ఎక్కువ పనితీరు కనబర్చిన వారికి ఇంక్రిమెంట్లు 10 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
జింకల వేటగాళ్లను తప్పించారు: కిషన్‌రెడ్డి
సింగరేణి కార్మికుల జీతాల పెంపునకు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన వేటగాళ్లు జింకలను వేటాడిన కేసులో దోషులను కావాలనే తప్పించారని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘వేటాడిన జింకలను చిన్నకారులో కుక్కి మిగతా వాహనాలను విడిచిపెట్టారు. అంత చిన్న కారులో పెద్ద పెద్ద జింకలను వేసుకుని ఎవరూ వెళ్లరు. దోషులను వదిలేశారని అక్కడి పరిస్థితి చూస్తేనే స్పష్టమవుతోంది’’ అని గురువారం సభలో ఆయన ధ్వజమెత్తారు. ‘ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. మరి సింగరేణి కార్మికులేం పాపం చేశారు?’ అని ప్రశ్నించారు. వారికి కనీస వేతనాలు కూడా అందటం లేదని విమర్శించారు. యాదాద్రి ప్రాజెక్టుకు సినీ వ్యక్తి ఆర్కిటెక్టా: పద్మావతి యాదాద్రి దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినందుకు ఆనందం వేసినా, సినిమా రంగానికి చెందిన ఆనంద్‌సాయికి ఆర్కిటెక్ట్ బాధ్యత అప్పగించటం ఆశ్చర్యం, బాధ కలిగించాయని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టును మంచి అర్కిటెక్ట్‌కు అప్పగిస్తే ఆలయం అనుకున్న రీతిలో రూపుదిద్దుకుంటుంది. ఈ భారీ ప్రాజెక్టులో నిపుణుడైన ఆర్కిటెక్ట్‌ను నియమిస్తే మేలు అని సూచించారు. -
శ్రమకు దక్కిన గౌరవం
► ఆనందంలో అంగన్ వాడీ టీచర్లు, సహాయకులు ► వేతనం పెంపుతో జిల్లాలో 2,900 మందికి లబ్ధి సాక్షి, రంగారెడ్డి జిల్లా: అంగన్ వాడీ టీచర్లు, సహాయకుల శ్రమకు గౌరవం లభించింది. ఏళ్లుగా అన్నీ తామై చేస్తున్న సేవలకుగాను ఫలితం దక్కింది. వీరు ప్రస్తుతం అందుకుంటున్న గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు సీఎం కె. చంద్రశేఖరరావు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 1,500 మంది అంగన్వాడీ టీచర్లకు, 1,400 మంది సహాయకులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ప్రతి నెలా టీచర్లకు రూ. 7 వేలు, సహాయకులకు రూ. 4,500 గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తోంది. టీచర్లకు రూ. 10,500, సహాయకులకు రూ. 6 వేలకు పెంచుతూ సీఎం ప్రకటించడంతో వారి మోముల్లో ఆనందం తొణికిసలాడు తోంది. తాము చేస్తున్న పనులకు.. పొందుతున్న గౌరవ వేతనానికి ఏ మాత్రం పొంతన లేదని వారు గతంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. సేవలు ఇవే... అంగన్ వాడీల్లో నమోదైన పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా బోధన, పౌష్టికాహారం అందజేత, మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు స్నాక్స్ వండి వడ్డించడం, గర్భిణీలకు ఒకపూట భోజనం పెట్టడం వంటి పనులు చేస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్య సంబంధమైన బాధ్యతలను వీరికే అప్పగిస్తున్నారు. ఇవే కాదు.. ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టినా వీరి సహాయం లేకుండా అమలు సాధ్యంకాని పరిస్థితి. చివరకు సర్వేలకు సైతం వీరి సేవల్ని వినియోగించుకున్న దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా అంగన్ వాడీల పనివేళల్ని పెంచినప్పటి నుంచి వీరికి ఎనలేని బాధ్యతలు సంక్రమించాయి. అలాగే పనిభారం కూడా రెట్టింపయ్యింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్ వాడీలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను శిరసా వహిస్తూ పనిచేసూ్తనే.. మరోవైపు తమ దీనస్థితిపై ఎలుగెత్తారు. వీరి ఆవేదనను ఆలకించిన ప్రభుత్వం..గౌరవ వేతనం పెంచుతామని ప్రకటించడంతో అంగన్ వాడీ లోకమంతా ఆనందాల్లో మునిగిపోయింది. తాము ఇకపై మరింత ఉత్సాహంతో సేవలందిస్తామని చెబుతున్నారు. అంతేగాక బీమా సౌకర్యం కల్పిస్తామనడంపైనా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జిల్లాలో 1600 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో దాదాపు వంది టీచర్ల పోస్టులు, రెండు వందల సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా త్వరలో భర్తీచేస్తామని చెప్పడం ద్వారా ఆశావహ అభ్యర్థుల్లోనూ ఉత్సాహం మొదలైంది. -
'కార్మికులకు తొలుత రూ.1,000 పెంచుతాం'
తాండూరు (రంగారెడ్డి): మునిసిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు తొలుత రూ.1,000 పెంచుతామని రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. జీతాల పెంపు డిమాండ్‌తో గత నెలరోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో... మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మునిసిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. దీనికి మంత్రి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు తొలుత రూ.1,000 మేర జీతం పెంచుతామని, తర్వాత మరికొంత పెంచుతామని సమ్మె విరమించాలని కోరారు. కార్మికులకు ప్రస్తుతం రూ.8,300 జీతం వస్తుండగా... దాన్ని కనీసం రూ.12 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
‘ఉపాధి’పై నేడోరేపో రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు
ఏప్రిల్ 1 నుంచి రూ.180 కూలీ సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజూ వారీ వేతనాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీచేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద గ్రామీణ పేద కూలీలకు రోజువారీ వేతనం రూ.169 ఇస్తుండగా, తాజా పెంపుతో అది రూ.180 కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వేతన పెంపునకు సంబంధించిన ఫైలును గ్రామీణాభివృద్ధి విభాగం ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయని సమాచారం. పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచే అమలవుతుం దని గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు తెలిపారు. రోజుకు 8 లక్షల మందికి ఉపాధి వేసవి కాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని (హైదరాబాద్ మినహా) జిల్లాల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. గ్రామీణాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో వ్యవసాయ పనులు ఇప్పటికే పూర్తికావడం, మరికొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండటంతో గత మూడు నెలలుగా రోజువారీ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1.33 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనగా.. ఫిబ్రవరిలో 5.68 లక్షలు, మార్చిలో వీరి సంఖ్య 7.90 లక్షలకు చేరుకుంది. తాజా సమాచారం మేరకు ప్రతిరోజూ 8,00,693 మంది ఉపాధి హామీ పనులకు వస్తున్నారని, ఈ నెలాఖారు కల్లా ఈ సంఖ్య రోజుకు 12 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‘వేడి’..
ప్రభుత్వ దమనకాండపై పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు,రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం నిర్బంధాలను దాటుకుని హైదరాబాద్‌లో ఉద్యమించిన అంగన్వాడీలు అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్టు సాక్షి, విజయవాడ బ్యూరో: జీతాల పెంపుతో సహా తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన అంగన్వాడీలపై ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మంగళవారం ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహజ్వాలలు వెళ్లగక్కారు. నిరసన ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి ప్రభుత్వ, సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణులు విడనాడాలని, అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుచేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో అంగన్వాడీల అరెస్టులను నిరసిస్తూ అందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటరమణ, రాంరెడ్డి ప్రతాపరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. -
సర్కార్ నిర్ణయంపై హర్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాష్ట్ర సర్కారు బంపర్ఆఫర్ ఇచ్చింది. ఏళ్లుగా వేతన పోరాటాలు చేస్తున్న వారికి భారీ నజరానా ప్రకటించింది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్లు, కౌన్సిలర్ల వేతనాలను పెద్ద మొత్తంలో పెంచింది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో వేతన పెంపు ప్రకటన చేయడంతో ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భారం రూ.7.67 కోట్లు ప్రజాప్రతినిధుల వేతన పెంపుతో సర్కారుపై భారం తీవ్రం కానుంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రజాప్రతినిధులకు యేటా రూ.1.46కోట్లు గౌరవవేతన రూపంలో పంపిణీ చేస్తున్నారు. తాజాగా వారి వేతనాలు పెంచడంతో.. ఇకపై ఏటా రూ.9.141 కోట్లు వేతనాల రూపంలో పంపిణీ చేయాలి. ఈ లెక్కన ఏటా రూ.7.67కోట్ల భారం జిల్లాపై పడుతుంది. నరేందర్ చొరవ..! స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవవేతనాల సవరణలో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. వేతనాల పెంపుపైపంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఒప్పించేందుకు చొరవచూపారు. స్థానిక సంస్థల ప్రతినిధి బృందాలను ఐక్యం చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చేయడంలో సఫలమయ్యారు. డైనమిక్ సీఎం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. స్థానిక సంస్థల పట్ల ఆయనకున్న అభిమానాన్ని వేతన పెంపు రూపంలో చూపించారు. ఇరవై ఏళ్లుగా వేతనాల పెంపుకోసం ఉద్యమిస్తుండగా.. ప్రస్తుత సీఎం నిర్ణయాన్ని ప్రకటించడం ఆనందకరం. గతంలో సీఎంలకంటే కేసీఆర్ డైనమిక్ సీఎం కాబట్టి.. ఆయన సాహసోపేతంగా వేతనాల పెంపు ప్రకటన చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు కూడా ఇస్తారు. - పి.సునీతారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాకు ఇంకాస్త పెంచాల్సింది.. వేతనాల పెంపును మేము స్వాగతిస్తూ కేసీఆర్‌ను అభినందిస్తున్నాం. కానీ జెడ్పీటీసీల వేతనాన్ని రూ.10వేలకు మాత్రమే పెంచారు. కనిష్టంగా రూ.25వేలు పెంచితే బాగుండేది. ఎమ్మెల్యే వేతనంలో కనీసం పావువంతైనా జెడ్పీటీసీకి ఇవ్వాలి. జెడ్పీటీసీలకు మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నా. - జంగారెడ్డి, కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫ్లోర్‌లీడర్ -
టెక్ మహీంద్రా లాభం 20% డౌన్
1:1బోనస్ ఇష్యూ, షేరు విభజన ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం (కన్సాలిడేటెడ్) 20% క్షీణించి రూ. 805 కోట్లుగా నమోదైంది. కరెన్సీ మారకం విలువపరృమెన నష్టాలు, వేతనాల పెంపు ఇందుకు కారణం. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిృో లాభం రూ. 1,010 కోట్లు. ఇక తాజా క్యూ3లో ఆదాయం రూ. 4,899 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ. 5,752 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు, కరెన్సీ హెచ్చుతగ్గులు, పన్నులకు అధిక ప్రొవిజనింగ్ తదితర అంశాలు లాభాలపై ప్రభావం చూపినట్లు సంస్థ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి తెలిపారు. కరెన్సీపరమైన ఒత్తిళ్లు ఇకపైనా కొనసాగే అవకాశం ఉందని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. మరోవైపు మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు మరింత అవకాశం ఉందని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాణీ చెప్పారు. 240 మిలియన్ డాలర్లతో తలపెట్టిన లైట్‌బ్రిడ్జి కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ కొనుగోలు ప్రక్రియ ఫిబ్రవరిలో పూర్తి కావొచ్చని ఆయన వివరించారు. మరోవైపు, ప్రతి ఒక్క షేరుకి మరో షేరును(1:1) బోనస్‌గా ఇవ్వాలని, ఒక్కో షేరును రెండు కింద విభజించాలని బోర్డు నిర్ణయించింది. కంపెనీ ఆదాయాల్లో రూ. 5,254 కోట్లు ఐటీ వ్యాపారం నుంచి రాగా, మిగతాది బీపీవో విభాగం నుంచి వచ్చిందని గుర్నాణీ వివరించారు. మరోవైపు, క్యూ3లో కొత్తగా మరో 2,700 మందిని రిక్రూట్ చేసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 98,000కి చేరినట్లు ఆయన తెలిపారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 15 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్లు గుర్నాణీ పేర్కొన్నారు. కంపెనీ షేరు శుక్రవారం బీఎస్ఈలో సుమారు 1 శాతం క్షీణించి రూ. 2,878.30 వద్ద ముగిసింది. -
రవాణా సమ్మెతో 58 కోట్ల నష్టం
చెన్నై, సాక్షి ప్రతినిధి: రవాణా కార్పొరేషన్ కార్మిక చట్టం ప్రకారం మూడేళ్లకు ఒకసారి కార్మికులకు, ఉద్యోగులకు జీతాలను పెంచాల్సి ఉంది. ఈ పెంపు గడువు గత ఏడాది ఆగస్టు 30వ తేదీతో ముగిసింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నా వేతన పెంపుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రవాణాశాఖలోని 11 కార్మిక సంఘాలు గత నెల 28వ తేదీన సమ్మెకు శ్రీకారం చుట్టాయి. 12వ వేతన సవరణ ప్రకారం జీతాలు చెల్లించాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తదితర 22 డిమాండ్ల సాధన కోసం నాలుగురోజుల పాటు సమ్మె నిర్వహించారు. అన్నాడీఎంకే సంఘాలకు చెందిన కార్మికులు సమ్మెను బహిష్కరించి విధుల్లో చేరడంతో 30 శాతం బస్సులు తిరిగాయి. ఇతర సం ఘాల కార్మికుల వల్ల అనేక బస్‌లు డిపోల్లోనే ఉండిపోయూయి. సమ్మెకు మద్దతుగా రవాణాశాఖలోని ఉద్యోగులు విధులను బహిష్కరిం చారు. రవాణా సమ్మెతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో అవస్థలు పడ్డారు. ఆటోవాలాలు, కాల్టాక్సీల వారు అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకున్నారు. ఈ సమ్మె కార్పొరేషన్‌నూ నష్టాల్లోకి నెట్టేసింది. పోలీసుల బందోబస్తు నడుమ అధికార పక్షం కార్మికులు సమ్మెసాగిన నాలుగురోజుల్లో బస్సులను తిప్పినా అది నామమాత్రమైంది. రాష్ట్రం మొత్తంమీద రోజుకు 22,500 బస్సులు తిరుగుతూ రూ.22 కోట్లు వసూలు చేశాయి. అయితే సమ్మె రోజు ల్లో కేవలం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లకే వసూలు పరిమితమైంది. ఈ లెక్కన సుమారు రూ.58 కోట్ల వరకు నష్టం సంభవించినట్లు అంచనా. 120 బస్సులు ధ్వంసమయ్యాయి. 11 మందితో చర్చల బృందం: సమ్మె నాల్గోరోజున రాష్ట్రరవాణాశాఖా మంత్రి సెంథిల్ బాలాజీ కార్మిక సంఘం నేతలతో చర్చలు జరి పారు. గత నెల 31వ తేదీన సమ్మెను విరపింపజేశారు. డిమాండ్ల సాధనకు అధికారులు, కార్మిక సంఘాలతో కూడిన బృందాన్ని వారం రోజుల్లోగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు. గవర్నర్ కే.రోశయ్య ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రప్రభుత్వ సంయుక్త ప్రధాన కార్యదర్శి ప్రభాకరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. 1977నాడు రూపొందించుకున్న కార్మిక చట్టం ప్రకారం వేతన ఒప్పందం జరగాలని, 12వ వేతన సవరణ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లపై చర్చ లు జరపనున్నారు. ఈ బృందంలో న్యాయశాఖ సంయుక్త సంచాలకులు ఉమానాథ్తోపా టు రవాణా కార్పొరేషన్ సంచాలకులు, కార్మి క సంఘాల అధ్యక్షులు సభ్యులుగా ఉన్నారు. -
సత్య నాదెళ్లకు రూ. 520 కోట్ల ప్యాకేజీ
-
స్తంభించిన బ్యాంకింగ్
రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన బ్యాంకు ఉద్యోగులు బెంగళూరు : చాలా కాలంగా అపరిృ్కతంగా ఉన్న వేతనాల పెంపు అంశంతో పాటు వివిధ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు మంగళవారం విధులను బహిష్కరించి సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. ఇక బెంగళూరులోని వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు సైతం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఉదయం టౌన్‌హాల్ నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంయుక్త వేదిక ప్రతినిధి ఏఎన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ...2012 నవంబర్ తర్వాత వేతన సవరణ జరగలేదని తెలిపారు. 25 శాతం మేర వేతనాలను పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) మాత్రం 11 శాతం మాత్రమే వేతనాలను పెంచుతామని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఐబీఏ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. -
సత్య నాదెళ్లకు రూ. 505 కోట్ల ప్యాకేజీ
సీఈవో అయ్యాక 10 రెట్లు జంప్ న్యూయార్క్: మహిళా ఉద్యోగుల జీతాల విషయంలో వ్యాఖ్యలతో ఇటీవల వివాదంలో చిక్కుకున్న సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ ఏడాది దాదాపు రూ. 505 కోట్ల (84.3 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీ ఆర్జించారు. దీంతో టెక్నాలజీ రంగంలో అత్యధిక జీతభత్యాలు అందుకుంటున్న వారిలో ఒకరిగా నిల్చారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి మైక్రోసాఫ్ట్ సమర్పించిన వివరాల ప్రకారం 2013 ఆర్థిక సంవత్సరంలో ఆయన 7.66 మిలియన్ డాలర్లు. కొత్తగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి సీఈవోగా ప్రమోట్ అయ్యాక ఇది ఏకంగా పది రెట్లు పైగా ఎగిసింది. తాజాగా ఆయన 9,18,917 డాలర్ల జీతం, 3.6 మిలియన్ డాలర్ల బోనస్‌ను ఆర్జించారు. అలాగే కీలక సమయంలో కంపెనీలోనే కొనసాగుతూ సీఈవోగా ప్రమోట్ అయిన నేపథ్యంలో 79.77 మిలియన్ డాల ర్లు విలువ చేసే స్టాక్స్ ఆర్జించారు. దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఇందులో 59.2 మిలియన్ డాలర్ల స్టాక్స్ లభిస్తాయి. అయితే, 2019లోగా మాత్రం నాదెళ్ల వీటిని అందుకునే వీలు ఉండదు. జీతాల పెంపు విషయంలో మహిళా ఉద్యోగులు కంపెనీ వ్యవస్థను విశ్వసించి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలని నాదెళ్ల వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలి సిందే. అయితే, తన అభిప్రాయాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోయానంటూ ఆయన పలుమార్లు క్షమాపణ కోరారు. ఎవ్వరైనా సరే కెరియర్లో లింగవివక్షకు గురై ఉంటే కచ్చితంగా ఎదిరించాల్సిందేనన్నారు. -
తీపి కబురు
చెన్నై, సాక్షి ప్రతినిధి: విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు తీపి కబురందింది. కాంట్రాక్టు కార్మికులతో సహా ఉద్యోగులందరికీ 7 శాతం జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.252 కోట్ల భారం పడుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం వెల్లడించారు. కొడనాడు నుంచి సీఎం జయలలిత మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. కార్మికుల హక్కులు కాపాడటం, సుఖమయ జీవి తాన్ని అందుబాటులోకి తేవడం ప్రభుత్వ కర్తవ్యాలుగా భావిస్తోందని అన్నారు. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం 2011 నవంబరు 30వ తేదీతో ముగిసిందని పేర్కొన్నారు. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అదే ఏడాది డిసెంబరు 16న వేతన సవరణ కమిషన్‌ను నియమించామని తెలిపారు. ఈ కమిషన్ 15 కార్మిక సంఘాలతో చర్చించి నివేదికను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ నివేదికలో పేర్కొన్న సిఫార్సుల ప్రకారం గడిచిపోయిన కాలం 2011 డిసెంబరు 1 నుంచి 2013 డిసెంబరు 31వ తేదీ వరకు పెంచిన వేతనాలను అందజేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. పెంచిన వేతనాలను కొత్త ఏడాది కానుకగా రెండు వాయిదాల్లో జనవరి, ఏప్రిల్ మాసాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వేతన సవరణ ఒప్పదం 2015 నవంబరు 30వరకు అమల్లో ఉంటుందని సీఎం తెలిపారు. 70,820 మంది కార్మికులు, 10,160 మంది అధికారులు వేతన సవరణతో లబ్ధి పొందుతారని ఆమె చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.252 కోట్ల అదనపు భారం పడుతుందని ఆమె వివరించారు. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 670 మంది నర్సుల నియామకం చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో 741 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిల్లో ప్రస్తుతానికి 670 ఖాళీలను భర్తీచేశామని చెప్పారు.