రవాణా సమ్మెతో 58 కోట్ల నష్టం
చెన్నై, సాక్షి ప్రతినిధి: రవాణా కార్పొరేషన్ కార్మిక చట్టం ప్రకారం మూడేళ్లకు ఒకసారి కార్మికులకు, ఉద్యోగులకు జీతాలను పెంచాల్సి ఉంది. ఈ పెంపు గడువు గత ఏడాది ఆగస్టు 30వ తేదీతో ముగిసింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నా వేతన పెంపుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రవాణాశాఖలోని 11 కార్మిక సంఘాలు గత నెల 28వ తేదీన సమ్మెకు శ్రీకారం చుట్టాయి. 12వ వేతన సవరణ ప్రకారం జీతాలు చెల్లించాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తదితర 22 డిమాండ్ల సాధన కోసం నాలుగురోజుల పాటు సమ్మె నిర్వహించారు.
అన్నాడీఎంకే సంఘాలకు చెందిన కార్మికులు సమ్మెను బహిష్కరించి విధుల్లో చేరడంతో 30 శాతం బస్సులు తిరిగాయి. ఇతర సం ఘాల కార్మికుల వల్ల అనేక బస్‌లు డిపోల్లోనే ఉండిపోయూయి. సమ్మెకు మద్దతుగా రవాణాశాఖలోని ఉద్యోగులు విధులను బహిష్కరిం చారు. రవాణా సమ్మెతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో అవస్థలు పడ్డారు. ఆటోవాలాలు, కాల్‌టాక్సీల వారు అధిక చార్జీలతో ప్రయాణికులను దోచుకున్నారు.
ఈ సమ్మె కార్పొరేషన్‌నూ నష్టాల్లోకి నెట్టేసింది. పోలీసుల బందోబస్తు నడుమ అధికార పక్షం కార్మికులు సమ్మెసాగిన నాలుగురోజుల్లో బస్సులను తిప్పినా అది నామమాత్రమైంది. రాష్ట్రం మొత్తంమీద రోజుకు 22,500 బస్సులు తిరుగుతూ రూ.22 కోట్లు వసూలు చేశాయి. అయితే సమ్మె రోజు ల్లో కేవలం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లకే వసూలు పరిమితమైంది. ఈ లెక్కన సుమారు రూ.58 కోట్ల వరకు నష్టం సంభవించినట్లు అంచనా. 120 బస్సులు ధ్వంసమయ్యాయి.
11 మందితో చర్చల బృందం: సమ్మె నాల్గోరోజున రాష్ట్రరవాణాశాఖా మంత్రి సెంథిల్ బాలాజీ కార్మిక సంఘం నేతలతో చర్చలు జరి పారు. గత నెల 31వ తేదీన సమ్మెను విరపింపజేశారు. డిమాండ్ల సాధనకు అధికారులు, కార్మిక సంఘాలతో కూడిన బృందాన్ని వారం రోజుల్లోగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు. గవర్నర్ కే.రోశయ్య ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రప్రభుత్వ సంయుక్త ప్రధాన కార్యదర్శి ప్రభాకరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశా రు.
1977నాడు రూపొందించుకున్న కార్మిక చట్టం ప్రకారం వేతన ఒప్పందం జరగాలని, 12వ వేతన సవరణ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లపై చర్చ లు జరపనున్నారు. ఈ బృందంలో న్యాయశాఖ సంయుక్త సంచాలకులు ఉమానాథ్‌తోపా టు రవాణా కార్పొరేషన్ సంచాలకులు, కార్మి క సంఘాల అధ్యక్షులు సభ్యులుగా ఉన్నారు.