ఇన్ఫోసిస్‌లో వేతన పెంపు అంతేనా..!
ఇన్ఫోసిస్‌లో వేతన పెంపు అంతేనా..!
Published Wed, Jul 5 2017 7:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM
బెంగళూరు : ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి వల్ల, ఇన్ఫోసిస్ వేతన పెంపును క్వార్టర్ పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాయిదా అనంతరం వేతన పెంపును కంపెనీ ఈ నెల నుంచి చేపట్టింది. సగటును ఉద్యోగుల వేతన పెంపును కంపెనీ 5 శాతం చేపట్టినట్టు తెలిసింది. ఇన్ఫోసిస్ ప్రత్యర్థి విప్రో కూడా ఇదే మేర పెంపును చేపడుతున్నట్టు వెల్లడైంది. జాబ్ లెవల్ 6 ఉద్యోగుల(మేనేజర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు), అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగుల సమీక్షించిన వేతన పరిహారాలు జూలై నుంచి అమల్లోకి వస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌లో కంపెనీ ఇంక్రిమెంట్లను చేపడుతుంటూంది.
కానీ ఈ సారి ఇండస్ట్రీలో నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో కంపెనీ క్వార్టర్ కాలం పాటు ఇంక్రిమెంట్లను వాయిదా వేసింది. అయితే ఈ ఇంక్రిమెంట్లు గతేడాది కంటే తక్కువగా ఉన్నాయని తెలిసింది. గతేడాది 6-12 శాతం మధ్యలో ఇంక్రిమెంట్లను కంపెనీ ఆఫర్ చేసింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు(జాబ్ లెవల్ 7, అంతకంటే పైన) అసలు కంపెనీ ఇంక్రిమెంట్లనే చేపట్టడం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ ఐకౌంట్ ద్వారా వ్యక్తిగతంగా ఓ ఉద్యోగి సహకారం ఏ మేర ఉంటుందో తెలుసుకోవడం కోసం కంపెనీ ఎక్కువగా దృష్టిసారించింది. ఫీడ్‌బ్యాక్‌లను కూడా కంపెనీ నిరంతరం తీసుకుంటూనే ఉంది. కంపెనీలో ఎక్కువ పనితీరు కనబర్చిన వారికి ఇంక్రిమెంట్లు 10 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి.
Advertisement