Salon Owner Pio Imperati Sold Her His Venerable New Haven Business For 1 Dollar - Sakshi
Sakshi News home page

కోట్ల ఆస్తిని కేవలం ఒక్కడాలర్‌కే అమ్మాడు, ఎందుకో తెలుసా?

Published Sat, Jul 17 2021 12:59 PM | Last Updated on Sun, Jul 18 2021 12:07 PM

Salon Owner Pio Imperati Sold Her His Venerable New Haven Business For 1 Dollar - Sakshi

కోట్ల విలువైన ఆస్తిని ఎవరైనా రూపాయిలకే అమ్ముతారు. ఇదిగో ఈ పెద్ద మనిషి అలాగే అమ్మాడు. కోట్ల విలువైన సెలూన్‌ షాప్‌ను తన షాపులో పనిచేసే ఉద్యోగికి కేవలం డాలర్‌ (ఇండియన్‌ కరెన్సీలో రూ.74.91)కే అమ్మాడు.


ఇటలీకి చెందిన పియస్‌ 1965లో రోడ్‌ సైడ్‌ చిన్న బార్బర్‌ షాప్‌ నుంచి ప్రముఖ హెయిర్ సెలూన్‌ ఓనర్‌ దాకా ఎదిగారు. ఓవైపు కుటుంబ పోషణ కోసం ఎయిర్‌ సెలూన్‌ బిజినెస్‌ రన్‌ చేస్తూ.. పార్ట్‌ టైమ్‌లో తనకెంతో ఇష్టమైన సివిల్‌ కాంట్రాక‍్టర్‌ గా పనిచేస్తుండేవారు. సరిగ్గా అదే సమయంలో అంటే 15ఏళ్ల క్రితం ఓ రోజు పియస్‌కు కాథీ మౌరా అనే స్కూల్‌ విద్యార్ధిని 'అంకుల్‌ నాకు జాబ్‌' కావాలని ఫోన్‌ చేసింది.

కాథీ మౌరా స్కూల్‌ డేస్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆమె స్కూల్‌ విద్యార్ధి కావడం, పైగా అనుభవం లేదని చాలా మంది జాబ్‌ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎక్కడ జాబ్‌ దొరక్కపోవడంతో కాథీకి ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి తాను చదివే స్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ను తనకు జాబ్‌ చూడాలని కోరింది. దీంతో సదరు టీచర్‌ పియస్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. ఆ తరువాత పియుస్‌ కు కాథీ ఫోన్‌ చేయడం, పియుస్‌కు చెందిన హెయిర్ సెలూన్‌లో జాయిన్‌ అవ్వడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు అదే పియుస్‌ ఎయిర్‌ సెలూన్‌కు కాథీ ఓనర్‌ అయ్యింది. 


ఎలా అంటారా? ఈ 15 ఏళ్ల నుంచి కాథీ మౌరా హెయిర్ సెలూన్‌లో మంచి ఎంప్లాయిగా, హెయిర్ స్టైలిష్‌గా మంచి పేరు సంపాదించింది. అయితే వయస్సు రిత్యా పియుస్‌ తన హెయిర్ సెలూన్‌ను అమ్మాలని అనుకున్నాడు. అది కూడా తన హెయిర్ సెలూన్‌లో పనిచేసే కాథీకి. కేవలం ఒక్కడాలర్‌కే. పియుస్‌ ఇన్నేళ్లు అపురూపంగా చూసుకున్న తన సెలూన్‌ను కాథీ చేతిలో పెట్టాడు.

ఈ సందర్భంగా పియుస్‌ మాట్లాడుతూ.. 'కాథీ చాలా మంచి అమ్మాయి. పైగా మంచి హెయిర్ స్టైలిష్ట్. 15ఏళ్లు నాతోనే పనిచేసింది. ఆమెకు కృతజ్ఞతగా హెయిర్‌ సెలూన్‌ ను అమ్మేశాను'. కానీ ఒక్కడాలర్‌కే సెలూన్‌ అమ్మడంపై కాథీ ఒప్పుకోలేదని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, ఉద్యోగిని పట్ల చూపిన ప్రేమపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

చదవండి : దేశంలో బంగారం ధరలపై డిస్కౌంట్‌, తొలిసారి ఇలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement