సాక్షి, ముంబై: డెబిట్ కార్డు వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. అక్రమ, మోసపూరిత లావాదేవీలను అరికట్టే దిశగా ఏటీఎం లావాదేవీల విషయంలో దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 1, 2020న OTP ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో చాలా బ్యాంకులు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ పద్ధతికి మారనున్నాయి.
ఈ నిబంధన ప్రకారం ఎస్బీఐ ఏటీఎం నుంచి 10వేలకుమించి మనీ విత్‌డ్రా చేసే సందర్భంలో ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని ఎంటర్ చేసినపుడు మాత్రం ఏటీఎం లావాదేవీ పూర్తవుతుంది. అంటే రూ.10,000 లోపు నగదు విత్ డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి.
♦ ఏటీఎంలో ఎస్బీఐ మీ డెబిట్ కార్డ్ స్వైప్ చేయాలి.
♦ ఆ తర్వాత మీరు డ్రా చేయాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
♦ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ( విత్‌డ్రా మొత్తం 10వేల రూపాయలకు మించితేనే)
♦ నాలుగు అంకెల అధికారిక ఓటీపీ ఎంటర్ చేసి నగదు విత్‌డ్రా చేయొచ్చు.
♦ ఈ ఓటీపీ కేవలం ఒక ట్రాన్సాక్షన్‌కు మాత్రమే వర్తిస్తుందనేది గమనించాలి.
అంతేకాదు నగదు విత్ డడ్రాలో అక్రమాలను అరికట్టేందుకు మిగిలిన బ్యాంకులు కూడా ఏటీఎం లావాదేవీల్లో ఓటీపి విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment