ATM withdrawals
-
ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా?
సాక్షి, ముంబై: డెబిట్ కార్డు వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. అక్రమ, మోసపూరిత లావాదేవీలను అరికట్టే దిశగా ఏటీఎం లావాదేవీల విషయంలో దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 1, 2020న OTP ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో చాలా బ్యాంకులు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ పద్ధతికి మారనున్నాయి. ఈ నిబంధన ప్రకారం ఎస్బీఐ ఏటీఎం నుంచి 10వేలకుమించి మనీ విత్‌డ్రా చేసే సందర్భంలో ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని ఎంటర్ చేసినపుడు మాత్రం ఏటీఎం లావాదేవీ పూర్తవుతుంది. అంటే రూ.10,000 లోపు నగదు విత్ డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. ♦ ఏటీఎంలో ఎస్బీఐ మీ డెబిట్ కార్డ్ స్వైప్ చేయాలి. ♦ ఆ తర్వాత మీరు డ్రా చేయాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ♦ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ( విత్‌డ్రా మొత్తం 10వేల రూపాయలకు మించితేనే) ♦ నాలుగు అంకెల అధికారిక ఓటీపీ ఎంటర్ చేసి నగదు విత్‌డ్రా చేయొచ్చు. ♦ ఈ ఓటీపీ కేవలం ఒక ట్రాన్సాక్షన్‌కు మాత్రమే వర్తిస్తుందనేది గమనించాలి. అంతేకాదు నగదు విత్ డడ్రాలో అక్రమాలను అరికట్టేందుకు మిగిలిన బ్యాంకులు కూడా ఏటీఎం లావాదేవీల్లో ఓటీపి విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా చదవండి: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్ -
ఎస్బీఐ ఏటీఏం సేవలు; కొత్త నిబంధన
సాక్షి, ముంబై: కొత్త ఏడాది నుంచి దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. నగదు అక్రమలావాదేవీలు, ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా సేవలను తీసుకొస్తోంది. సురక్షితమైన ఏటీఎం సేవలకు అందించడంతోపాటు, మోసపూరిత లావాదేవీలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్బీఐ ట్విటర్లో వెల్లడించింది. అన్ని ఎస్బీఐ ఏటీఎంలలోనూ 2020 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి కొత్త ఏడాదిలో ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బు ఉపసంహరణకు ప్రయత్నిస్తే.. అప్పుడు బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినపుడు మాత్రమే డబ్బులు తీసుకోవడం వీలవుతుంది. ఈ ఓటీపీ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవలు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే ఎస్బీఐ ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు తీసుకోవాలని భావిస్తే ఈ ఓటీపీ విధానం వర్తించదు. కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రాకు ప్రయత్నించినపుడు మాత్రమే ఓటీపీ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా సేవలు అన్ని ఏటీఎం లావాదేవీలకు వర్తించవు. కేవలం రూ.10,000కు పైన లావాదేవీలకు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఎస్బీఐ ఏటీఎం నెట్‌వర్క్‌కు అంతటికీ ఓటీపీ విధానం అమలులోకి వస్తుంది. Introducing the OTP-based cash withdrawal system to help protect you from unauthorized transactions at ATMs. This new safeguard system will be applicable from 1st Jan, 2020 across all SBI ATMs. To know more: https://t.co/nIyw5dsYZq#SBI #ATM #Transactions #SafeWithdrawals #Cash pic.twitter.com/YHoDrl0DTe — State Bank of India (@TheOfficialSBI) December 26, 2019 -
పునరాలోచనలో ఎస్ బీఐ?
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ) అమల్లోకి తీసుకురానున్న చార్జీల బాదుడు నుంచి ఖాతాదారులకు ఉపశమనం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. చార్జీల మోత నిర్ణయంపై పునరాలోచించాలని ఎస్ బీఐని కేంద్ర ప్రభుత్వం కోరిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కనీస నిల్వ పరిమితిపై పెనాల్టీ, ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణలపై చార్జీలు వేయొద్దని ప్రైవేటు బ్యాంకులతో సహా ఎస్ బీఐని కేంద్రం కోరినట్టు తెలిపాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బ్యాంకులు తమ నిర్ణయంపై పునరాలోచన చేసే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్ బీఐ చార్జీల బాదుడును ఉపసంహరించుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై జరిమానా విధించాలని ఎస్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఏటీఎం సహా పలు ఇతర సేవల చార్జీలను కూడా ఎస్బీఐ సవరించింది.