న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో విధానాలను సవరించడం ద్వారా లిక్విడిటీని పెంచే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా కన్సల్టేషన్ పేపర్‌ను రూపొందించింది. తద్వారా ప్రతీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్రత్యేకించిన విధానాల ద్వారా లిక్విడ్ కాంట్రాక్టుల నిర్వహణకు తెరతీయాలని భావిస్తోంది. ఇందుకు వన్ కమోడిటీ వన్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో ఒక విధానానికి ప్రతిపాదించింది.
వెరసి కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లలో లావాదేవీల వికేంద్రీకరణను తగ్గించడం ద్వారా లిక్విడిటీని మెరుగుపచాలని సెబీ చూస్తోంది. ఎక్సే్చంజ్ ఆధారిత ప్రత్యేక కమోడిటీస్ సెట్‌ను రూపొందించడం ద్వారా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఈ విధానాలను నేరో అగ్రికమోడిటీలు, కొన్ని వ్యవసాయేతర కమోడిటీలకు మాత్రమే ఉద్ధేశించినట్లు తెలుస్తోంది. ఈ విధానాలపై జనవరి 7వరకూ సెబీ అభిప్రాయాలను సేకరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment