
ముంబై: స్టాక్ మార్కెట్‌లో మరోసారి సానుకూల వాతావరణం నెలకొంది. మార్కెట్ ప్రారంభం అవడం ఆలస్యం ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిండంతో వరుసగా లాభాలు పొందుతూ పోయింది. మార్కెట్ మొదలైన అరగంటకే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లు లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి. గత వారం చివర్లో నష్టపోయిన పాయింట్లను తిరిగి పొందే ప్రయత్నం చేశాయి. అయితే అంతలోనే చెరో యాభై పాయింట్లు కోల్పోయాయి. అంతర్జాతీయ, ఏషియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం కారణంగానే దేశీ సూచీలు లాభాలను చూపిస్తున్నాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 55,695 పాయింట్ల మొదలైంది. ఆ వెంటనే వరుసగా పొయింట్లు పొందుతూ ఉదయం 9:45 గంటల సమయంలో 363 పాయింట్లు లాభపడి 55,693 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 16,550 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్ సూచీలు ఇదే జోరు కొనసాగిస్తే గత వారం నమోదు చేసిన ఆల్‌టై హై పాయింట్లను టచ్ చేసే అవకాశం ఉంది.