
ముంబై : రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో గత నాలుగు సెషన్లుగా జోరు కొనసాగిస్తున్న బుల్‌కి బ్రేకులు పడ్డాయి. ప్రారంభం భారీ లాభాలతో మొదైలన మార్కెట్ మధ్యాహ్ననం సమయానికి నష్టాల దిశగా వెళ్లింది. అయితే మార్కెట్ మరి కొద్ది సేపట్లో ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు నమ్మకం కనబరచడంతో మార్కెట్ కొంత మేర కోలుకుంది
కొత్త రికార్డులు
దేశీ సూచీలు ఈ రోజు మార్కెట్‌లో కొత్త ఎత్తులకు చేరాయి. సెన్సెక్స్ 57 వేల మార్క్‌ని టచ్ చేయగా నిఫ్టీ 16,700 మార్క్‌ని అందుకుంది. ఆగస్టు 13న సెన్సెక్స్ 55 వేలు క్రాస్ చేయగా కేవలం నాలుగు సెషన్స్‌లోనే రికార్డులు బద్దలు కొడుతూ ఆగస్టు 18న 56 వేలు క్రాస్ చేసింది. అంతకు ముందు 54,000 నుంచి 55,000కి రావడానికి ఏడు సెషన్లు, 53,000 నుంచి 54 వేలకి రావడానికి 30 సెషన్ల సమయం తీసుకుంది. ఇక 52,000 నుంచి 53,000లు టచ్ చేసేందుకు ఏకంగా 85 సెషన్లు పట్టింది. ఈ ఏడాదిలో ఈ వారమే సెన్సెక్స్ అత్యధిక పాయింట్లు పొందింది. మరోవైపు నిఫ్టీ సైతం రికార్డులు బద్దలు కొడుతూ 16,700 మార్క్‌ని దాటింది. ఆ తర్వాత మార్కెట్ ఒత్తిడి లోను కావడంతో ఇటు నిఫ్టీ, అటు సెన్సెక్స్‌లు తమ రికార్డులను నిలబెట్టుకోలేక పోయాయి. ఇకపై మార్కెట్‌లో బుల్ ట్రెండ్ కొనసాగాలంటే లార్జ్ క్యాప్ షేర్లు ప్రభావం చూపించాల్సి ఉంటుంది.
నష్టాలతోనే ముగింపు
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 56,073 పాయింట్లతో ప్రారంభమైంది. ఒక దశలో 56,118 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 55,514 పాయింట్లకు పడిపోయంది. మార్కెట్ ముగిసే సమయానికి కొంత మేర కోలుకుని 162 పాయింట్లు నష్టపోయి 55,629 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ సైతం 45 పాయింట్లు నష్టపోయి 16,568 పాయింట్ల వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment