వారం రోజుల క్రితం ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 17 (గురువారం) ‘సిబ్బంది మరిన్ని గంటలు పనిచేయాలి.. లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తా, కాదు కూడదు అంటే మీరే రాజీనామాలు చేయండి’ అంటూ అల్టిమేట్టం జారీ చేశారు. ఉద్యోగుల తుది నిర్ణయం వెల్లడించేందుకు అదే రోజు సాయంత్రం 5గంటల వరకు డెడ్ లైన్ విధించారు.
దీంతో హార్డ్ వర్క్ చేయాలన్న మస్క్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 1200 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. మిగిలిన వారిపై మస్క్ వేటు వేశారు. ఈ సందర్భంగా మస్క్ తొలగించిన ట్విటర్ బోస్టన్ కార్యాలయం ఉద్యోగులు..తాము ఎన్ని సెకన్లలో ఉద్యోగం కోల్పోతున్నామో కౌంట్ డౌన్ లెక్కించారు. ప్రస్తుతం ఆ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
న్యూ ఇయర్ స్టైల్లో ఉద్యోగం పోగొట్టుకున్నారు
వెలుగులోకి వచ్చిన ఆ వీడియోల్లో మాట్ మిల్లర్ అనే ట్విటర్ మాజీ ఉద్యోగి తనతో పాటు తన సహచర ఉద్యోగుల్ని మస్క్ తమను ఉద్యోగం నుంచి తొలగించారంటూ లైవ్‌లో చూపించారు.
అందులో ప్రతి ఏడాది డిసెంబర్ 31 రాత్రి కొత్త ఏడాది ఆహ్వానిస్తూ సెకన్లు లెక్కిస్తూ కరెక్ట్‌గా 12ఏఎం అయిన తర్వాత కొత్త సంవత్సరం వేడుకల్ని ప్రారంభిస్తామో.. అలాగే 30సెకెండ్స్, 35సెకెండ్స్, 10, 9 అని కౌంట్ చేస్తూ ట్విటర్‌లో ఉద్యోగం కోల్పోయామనే విషయాన్ని లైవ్‌లో వెల్లడిస్తాడు.
It’s been a ride pic.twitter.com/0VDf5hn2UA
— Matt Miller (@brainiaq2000) November 17, 2022
అంతేకాదు, ఆ వీడియోలో తనతో పాటు కొలీగ్స్‌ను..వారితో పాటు ఉద్యోగులు లేక ఖాళీగా ఉన్న ఆఫీస్‌ను చూపించారు. మీరు పనిచేసే చోటును ప్రేమించండి అంటూ చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment