దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనాలు నిజమయ్యాయి. అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం డేటా అంచనాల కంటే ఎక్కువ వచ్చింది. ఆ ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్, యూరప్, ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 612 పాయింట్ల భారీ లాభంతో 65524 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల లాభంతో 19629 వద్ద కొనసాగుతుంది.
హిందాల్కో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టాటాస్టీల్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బ్రిటానియా,పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా,ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment