దేశీయ స్టాక్‌మార్కెట్లు వారంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ముగించాయి. సోమవారం సెన్సెక్స్ 612 పాయింట్లు లేదా 0.75 శాతం పెరిగి 81,698.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 187.46 పాయింట్లు లేదా 0.76 శాతం పుంజుకుని 25,010.60 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50లోని 50 లిస్టెడ్ స్టాక్‌లలో 33 స్టాక్‌లు లాభాలను అందుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ అత్యధికంగా 4.24 శాతం వరకు లాభాలను పొందాయి. అదేవిధంగా, సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో, 21 స్టాక్‌లు లాభాలను చూశాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ 4 శాతం వరకు లాభాలను అందుకున్నాయి.
ఇక పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు సెబీ షోకాజ్ నోటీసు వార్తల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం బీఎస్‌ఈలో 4.25 శాతం క్షీణించాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment