
దేశీయ స్టాక్ మార్కెట్‌లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు లేని తరుణంలో ట్రేడర్లు అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు. ఇక ఉదయం 9.40గంటల సమయానికి సెన్సెక్స్ 569 పాయింట్లు లాభంతో 60378 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 17762 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
నిఫ్టీ 50లో బ్రిటానియా, సిప్లా, టాటా స్టీల్, ఆల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్,హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. కాగా,హోళీ సందర్భంగా మంగళవారం స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది.