
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 280 పాయింట్ల లాభంతో 60,126 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 17,716 దగ్గర కొనసాగుతోంది.
కొటాక్ మహీంద్రా, ఎథేర్ మోటార్స్, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐటీసీ, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజికీ, దివిస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఆల్ట్రాటెక్ సిమెంట్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెంయిట్స్, ఇన్‌ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి.