దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో దూసుకెళ్లాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మరింత లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్1,330.96 పాయింట్లు లేదా 1.68 శాతం పెరిగి 80,436.84 వద్ద ముగియగా, నిఫ్టీ 397.40 పాయింట్లు లేదా 1.65 శాతం పురోగమించి 24,541.15 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని 50 భాగాలలో 47 లాభాల్లో ముగిశాయి. విప్రో, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ లీడ్‌లో ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ స్పేస్‌లో టెక్ మహీంద్రా, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ అత్యధిక లాభాలను అందుకున్నాయి.
స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు వరుసగా 1.93 శాతం, 1.86 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, మీడియా, రియాల్టీ సూచీల సారథ్యంలో అన్ని రంగాల సూచీలు లాభాలతో స్థిరపడ్డాయి. ఇవి ఒక్కొక్కటి 2 శాతానికి పైగా ముగిశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment