దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 22,718కు చేరింది. సెన్సెక్స్ 103 పాయింట్లు దిగజారి 74,943 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 90 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.7 శాతం లాభాలతో ముగిసింది. నాస్‌డాక్ 1.68 శాతం లాభపడింది.
నేడు(ఏప్రిల్ 12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4 సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్‌కే ఇటీవల అంచనా వేసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment