దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 24,419కు చేరింది. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 80,193 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.44 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.88 శాతం, నాస్‌డాక్ 1.95 శాతం నష్టపోయాయి.
దిగ్గజ కంపెనీలు జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనుండటంతో, మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు, స్వల్పంగా నష్టపోయాయి. మదుపర్లు తమ మార్జిన్ల కోసం బ్రోకర్ల వద్ద తనఖా ఉంచేందుకు అనుమతించిన షేర్ల జాబితా నుంచి 861 కంపెనీలను ఆగస్టు 1 నుంచి తొలగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలను కఠినతరం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తనఖా జాబితా నుంచి ఎన్‌ఎస్‌ఈ తొలగించనున్న వాటిలో 861 కంపెనీల షేర్లతో పాటు 149 మ్యూచువల్ ఫండ్ పథకాలు కూడా ఉన్నాయి. జాబితాలో ఉన్న నమోదిత కంపెనీల్లో అదానీ పవర్, ఆదిత్య బిర్లా మనీ, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, ఇండియా పెస్టిసైడ్స్, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, వోకార్డ్, యెస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment