దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 24,554కు చేరింది. సెన్సెక్స్ 189 పాయింట్లు నష్టపోయి 80,535 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.73 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 85 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.4 శాతం, నాస్‌డాక్ 2.7 శాతం లాభపడ్డాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చిన్న-మధ్యస్థాయి షేర్లు మదుపర్లకు ఆకర్షణీయ ప్రతిఫలాన్ని అందించాయి. దేశ స్థూల ఆర్థిక మూలాలు ఆశావహంగా ఉండటంతో పాటు, దేశీయంగా నగదు లభ్యత పెరగడం కలిసొచ్చింది. ఈ ఏడాది జులై 16 వరకు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 10,984.72 పాయింట్ల (29.81%) పెరిగింది. స్మాల్‌క్యాప్ సూచీ 11,628.13 పాయింట్లు (27.24%) రాణించింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ 30 షేర్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 8,476.29 పాయింట్లే (11.73%) పెరగడం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లు సుదీర్ఘ కాలం బుల్ రన్‌ను కొనసాగిస్తుండటంతో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోని స్టాక్‌లు మరింతగా రాణించే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment