దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 24,165కు చేరింది. సెన్సెక్స్ 108 పాయింట్లు పుంజుకుని 79,071 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 102.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.85 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.68 శాతం, నాస్‌డాక్ 2.4 శాతం లాభపడ్డాయి.
అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు నిన్నటి మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో స్టాక్ సూచీలు నష్టపోయాయి. ఎఫ్‌ఐఐల విక్రయాలు కూడా సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.50% నష్టపోయి సూచీల పతనాన్ని శాసించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావంతో అదానీ గ్రూపులోని మొత్తం 11 లిస్టెడ్ కంపెనీల షేర్లలో 8 నష్టపోయాయి. సెన్సెక్స్‌లో నిన్న ఒక్కరోజు రూ.4.52 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
గమనిక: రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment