దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుల స్థాయి, వేగాన్ని ప్రభావితం చేసే కీలకమైన యూఎస్ జాబ్స్ రిపోర్ట్ విడుదల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీలు రెడ్‌లోకి పడిపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 1,017.23 పాయింట్లు లేదా 1.24% శాతం నష్టపోయి 81,183.93 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 292.95 పాయింట్లు లేదా 1.17% పడిపోయి 24,852.15 వద్ద స్థిరపడింది.
ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ లిస్టింగ్‌లో ఎస్‌బీఐ, బీపీపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివిస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ టాప్ గెయినర్స్‌గా లాభాలను ఆర్జించాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment