
ముంబై : స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీ సూచీలు మరోసారి ఆల్‌టైం హై దిశగా పయణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ రెండో సారి 56 వేల పాయింట్లను క్రాస్ చేయగా నిఫ్టీ సైతం 16,700 పాయింట్లను క్రాస్ చేసింది. మధ్యాహ్నం వరకు పాయింట్లు పెరుగుతూ పోయిన మార్కెట్ ఆ తర్వాత క్రమంగా నష్టపోవడం మొదలైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో సాయంత్రానికి సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో క్లోజవగా నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిసింది.
లాభాలు ఆవిరి
ఈ రోజు ఉదయం బీఎస్‌సీ సెన్సెక్స్ 56,067 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో ఏకంగా 56,198 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత నష్టాలను చవి చూస్తూ 55,899 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 14 పాయింట్లు నష్టపోయి 55,944 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోసారి 56 వేల మార్క్‌ను కాపాడుకోలేకపోయింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 16,654 పాయింట్లతో ప్రారంభమై 16,712 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 10 పాయింట్ల లాభంతో 16,634 పాయింట్ల వద్ద ముగిసింది.
లాభనష్టాలు
నిఫ్టీలో అదాని పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందాల్కో, కోల్ ఇండియా, ఓన్‌జీసీ షేర్లు లాభాలు పొందగా బజాజ్ ఫిన్ సర్వీస్, టైటాన్ కంపెనీ, మారుతి సుజూకి, భారతీ ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల పాలయ్యాయి
Comments
Please login to add a commentAdd a comment