ముంబై: భాగస్వామ్య సంస్థ(జేవీ) నిప్పన్ లీక్‌లెస్ టాల్‌బ్రోస్ నుంచి వైదొలగనున్నట్లు ఆటో విడిభాగాల కంపెనీ టాల్‌బ్రోస్ ఆటోమోటివ్ కంపోనెంట్స్ లిమిటెడ్(టీఏసీఎల్) తాజాగా పేర్కొంది. నిప్పన్ లీక్‌లెస్‌లో గల మొత్తం 40 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీకి విక్రయించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో జేవీలో 100 శాతం వాటా నిప్పన్ లీక్‌లెస్ సొంతం కానున్నట్లు తెలియజేసింది.
2005లో నిప్పన్ లీక్‌లెస్‌తో జత కట్టడం ద్వారా టాల్‌బ్రోస్ జేవీకి తెరతీసింది. నిప్పన్‌కు 60 శాతం, టాల్‌బ్రోస్‌కు 40 శాతం చొప్పున వాటాతో జేవీ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రధానంగా ద్విచక్ర వాహన రంగ దిగ్గజాల(ఓఈఎంలు) కోసం గ్యాస్‌కట్స్ తయారు చేసి సరఫరా చేస్తోంది. వ్యూహాత్మక బిజినెస్ సమీక్షలో భాగంగా నిప్పన్ లీక్‌లెస్ టాల్‌బ్రోస్‌లో మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు టీఏసీఎల్ జేఎండీ అనుజ్ తల్వార్ వివరించారు.
కంపెనీ గ్యాస్‌కట్స్‌సహా హీట్ షీల్డ్స్, ఫోర్జింగ్స్, సస్పెన్షన్ సిస్టమ్స్, యాంటీవైబ్రేషన్ ప్రొడక్టులు తదితరాలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. జేవీలో 40 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 82 కోట్లు లభించనున్నట్లు టీఏసీఎల్ వెల్లడించింది. మార్చిలోగా వాటా విక్రయం పూర్తికాగలదని భావిస్తోంది. నిధులను విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులకు వినియోగించనుంది. వాటా విక్రయ వార్తలతో టాల్‌బ్రోస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం పుంజుకుని రూ. 303 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment