
టెస్లా క్రిస్మస్ పండుగ సందర్బంగా తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో భాగంగా ఆర్కేడ్ ప్లాట్‌ఫామ్‌లో 3 కొత్త ఇన్-కార్ వీడియో గేమ్‌లను తీసుకొచ్చింది. సాంప్రదాయ వాహన తయారీదారులకు కంటే కొత్తగా ఏమైనా తీసుకోరడంలో భాగంగా టెస్లా కార్లలో వీటిని తీసుకొచ్చింది. క్రిస్మస్ నాడు కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ రానుంది అని గతంలో పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ అప్డేట్ సంబందించిన ఒక చిత్రం రెడ్‌డిట్‌లో లీక్ అయింది. నార్వేజియన్ భాషలో విడుదలైన నోట్లను ఉటంకిస్తూ యుఎస్ మీడియా టెస్లా కారులోని గేమ్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో ఒక భాగమని హైలైట్ చేశాయి. విడుదలైన చిత్రం ప్రకారం ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో కొత్త డ్రైవింగ్ విజువలైజేషన్లు, షెడ్యూల్లో మార్పులు వంటి మరెన్నో ఫీచర్స్ సూచిస్తాయి. ఈ గేమ్స్ కంప్యూటర్స్, గేమింగ్ కన్సోల్‌లలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ఆటలను టెస్లా ఆర్కేడ్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.(చదవండి: జూమ్ యూజర్లకు గుడ్ న్యూస్)
Comments
Please login to add a commentAdd a comment