బెంగుళూరు: భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనీస్ యాప్ టిక్‌టాక్‌ను నిషేందించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో అమెరికా సైతం టిక్‌టాక్‌ను నిషేధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తరికొత్త రీల్స్ ఫీచర్‌తో ముందుకొచ్చింది. దీంతో ఫేస్‌బుక్ సంస్థకు టిక్‌టాక్ గట్టిగా కౌంటరిచ్చింది. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ ఇప్పటికే యూఎస్‌లో టిక్‌టాక్ ప్రజాదరణ పొందిందని తెలిపింది.
ఏ దేశంలోనైనా టిక్‌టాక్ తన సేవలను మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుందని, ఫేస్‌బుక్ లాగా పోటీదారులను దెబ్బకొట్టడానికి దేశభక్తి లాంటి పదాలను వాడదని టిక్‌టాక్ సీఈఓ కెవిన్ మేయర్ విమర్శించారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌కు చెందిన వీడియో యాప్ లాసో విఫలం చెందిన విషయాన్ని టిక్‌టాక్ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విషయాన్ని ఆలస్యంగా ప్రపంచానికి చెప్పారని చైనాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శిస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment