
దేశంలో రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అస్సలు తగ్గేదేలే అనే రీతిగా ప్రతిరోజూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు ఒక తులం గోల్డ్ రేటు రూ. 900 నుంచి రూ. 980 వరకు పెరిగింది. ధరల పెరుగుదల తరువాత నేటి (ఏప్రిల్ 16) ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.67950 (22 క్యారెట్స్), రూ.74130 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 550 నుంచి రూ. 600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 900, రూ. 980 పెరిగింద ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 68100 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 74280 రూపాయలకు చేరింది. నిన్న రూ.550, రూ.600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ.900 నుంచి రూ.980 వరకు పెరిగింది.
ఇదీ చదవండి: బంగారం ధరలు పెరుగుదలకు కారణాలివే..
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 800 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 880 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 68700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 74950 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 16) వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 87000 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment