వినాయక చవితి సందర్భంగా పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ మీద రూ. 20 తగ్గింది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 200 వరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది. మీరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5,485 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5,984 వరకు ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ & 24 క్యారెట్ గోల్డ్ ధర వరుసగా రూ. 54850, రూ. 59840గా ఉంది. ఇదే ధర బెంగళూరు, గుంటూరు, విశాఖపట్టణం మొదలైన ప్రాంతాల్లో ఉంది. వెండి ధర ఒక గ్రాము రూ. 790 వద్ద నిలిచింది. కావున కేజీ వెండి ధర రూ. 79000. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 1000 పెరిగింది.
చైన్నైలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5510 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 6011 వరకు ఉంది. దీని ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ & 24 క్యారెట్ గోల్డ్ ధర వరుసగా రూ. 55100, రూ. 60110గా ఉంది. చెన్నైలో నేడు బంగారం ధర గ్రాము మీద రూ. 20 తగ్గింది. అంటే గత రెండు రోజుల్లో రూ. 400 తగ్గింది (10 గ్రామ్స్). వెండి ధర రూ. 10 పెరిగి గ్రాము రూ. 790 వద్ద నిలిచింది. కావున కేజీ వెండి ధర రూ. 79000.
ఇదీ చదవండి: ఐఫోన్ 15 సిరీస్ ఫస్ట్ సేల్ షురూ.. ఉదయం నుంచే వెయిట్ చేస్తున్న కస్టమర్లు!
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5500 & 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5994. 10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 55000 కాగా 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 59940గా ఉంది. వెండి 10 గ్రాముల ధర రూ. 755గా ఉంది. కావున కేజీ వెండి ధర రూ. 75500.
Comments
Please login to add a commentAdd a comment