
దేశీయ మార్కెట్లు మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. చైనా ప్రభుత్వం తెచ్చిన సాధారణ శ్రేయస్సు (కామన్ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన ప్రభుత్వ విధానం వల్ల చైనా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. అమెరికన్ మార్కెట్లు సైతం నష్టాలతో ముగిశాయి. కానీ వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.
దీంతో మంగళవారం ఉదయం 9.43 గంటల సమయానికి సెన్సెక్స్238.2పాయింట్ల లాభంతో 58741 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 77.05 పాయింట్ల లాభంతో 17468 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగుతుంది. ఓన్‌జీసీ,కోల్ ఇండియా,జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఏసియన్ పెయింట్స్,హెచ్‌యూఎల్,ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. మారుతి సుజికీ, యాక్సిస్ బ్యాంక్,బజాజ్ ఫిన్ సర్వ్,టాటా మోటార్స్,బాజాజ్ ఆటోషేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment