వారాంతంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (సోమవారం) శుభారంభం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 281.58 పాయింట్ల లాభంతో 70982.10 వద్ద, నిఫ్టీ 93.55 పాయింట్ల లాభంతో 21446.15 వద్ద కొనసాగుతోంది. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. దీంతో ఎస్ అండ్ పీ ఐదు రోజుల రికార్డు పరుగులకు బ్రేక్ పడింది. డౌజోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 0.1 శాతం, నాస్‌డాక్ 0.4 శాతం తగ్గింది. అమెరికా జీడీపీ 3.3 శాతం వార్షిక రేటుతో క్యూ4లో ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. US ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో స్వల్పంగా పెరిగింది. కానీ వార్షిక ద్రవ్యోల్బణం 3 శాతం తక్కువ కావడం గమనార్హం.
నేడు ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.46 శాతం లాభపడగా, టో పేక్స్ దాదాపు 1 శాతం ర్యాలీ చేసింది. గిఫ్ట్ నిఫ్టీ భారతీయ మార్కెట్లకు సానుకూల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఎర్ర సముద్రంలో క్షిపణి దాడి తర్వాత సరఫరా ఆందోళనల మధ్య ముడి చమురు ధరలు పెరిగాయి.
ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC), పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి.
సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment