సోమవారం లాభాల్లో ప్రారంభమై.. లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు తగ్గుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 182.99 పాయింట్ల నష్టంతో 73146.95 వద్ద, నిఫ్టీ 50.40 పాయింట్ల నష్టంతో 22044.95 వద్ద ముందుకు సాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), టాటా మోటార్స్, హిందాల్కో, JSW స్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) మొదలైన కంపెనీలు చేరాయి. ఐషర్ మోటార్స్, విప్రో, HCL టెక్నాలజీ, టెక్ మహీంద్రా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.
యూఎస్ మార్కెట్లో సోమవారం కొంత రేంజ్‌లోనే కదలాడాయి, దేశంలోని ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1085 కోట్లు విలువ గల షేర్లు కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.820.69 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ 0.02 శాతం పెరిగింది. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు కొంత జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది.
సోమవారం రోజు హౌతీ రెబల్స్, అమెరికాకు సంబంధించిన రాడార్లను నాశనం చేసినట్లు సమాచారం. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 72.38 డాలర్లుగా ఉంది. ఇటీవల ఐటీ స్టాక్స్ నిఫ్టీ అల్ టైమ్ హైలోకి వెళ్ళింది, దీనికి రిలయన్స్ కూడా సహకరించినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఐటీ స్టాక్స్ తాజాగా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాల్లో TCS, HCL కంపెనీలు తప్పా.. మిగిలిన స్టాక్స్ ఆశించిన మేర పోస్ట్ చేయకపోవడంతో.. మదుపర్లు ఆ సంస్థలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడ్ నిర్ణయాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే భావనతో మదుపర్లు ఐటీ స్టాక్స్‌లను మరింత కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల మార్కెట్లో ఐటీ రంగలోని స్టాక్స్, రిలియన్స్‌కు తోడు ఫార్మా స్టాక్స్ సైతం సానుకూలంగా స్పందించడంతో.. దేశీయ మార్కెట్లు జీవిత కాల గరిష్టాలను తాకుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకింగ్ రంగ స్టాకులో ఇంకా ర్యాలీ మొదలు కాలేదు, ఒక వేళా ఈ త్రైమాసిక ఫలితాల్లో వృద్ధిని సాధిస్తే బ్యాంకు నిఫ్టీ దేశీయ సూచీలు మరింత పెరిగేందుకు సహకారం అందించే వీలుందని చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment