
న్యూఢిల్లీ: స్కైపవర్ గ్రూప్‌నకు తెలంగాణలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంటు (ఎస్‌పీవీ) కొనుగోలు చేసినట్లు టొరెంట్ పవర్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 416 కోట్లు. స్కైపవర్ గ్రూప్ సౌత్‌ఈస్ట్ ఏషియా ఐఐఐ ఇన్వెస్ట్‌మెంట్స్, స్కైపవర్ సౌత్‌ఈస్ట్ ఏషియా హోల్డింగ్స్ 2 లిమిటెడ్, సన్‌శక్తి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ (ఎస్‌పీవీ)తో ఒప్పందం ప్రకారం 50 మెగాావాట్ల సోలార్ పవర్ ప్లాంటును కొనుగోలు చేసినట్లు టోరెంట్ పవర్ వివరించింది.
కిలోవాట్ అవర్‌కు సుమారు రూ. 5.35 రేటు చొప్పున 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (ఎన్‌పీడీసీటీఎల్)తో ఎస్‌పీవీకి ఒప్పందం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ టొరెంట్ పవర్ మొత్తం విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 4.1 గిగావాట్లుగా ఉంది. తాజాగా మరో సోలార్ పవర్ ప్లాంటు కొనుగోలుతో ఇది 4.7 గిగావాట్లకు చేరినట్లయ్యింది