వాషింగ్టన్: చైనీస్ యాప్ టిక్‌టాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. టిక్‌టాక్ కొనుగోలు విషయంలో అమెరికన్ కంపెనీలు దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరిపేందుకు 45 రోజుల గడువు విధించారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ గురువారం సంతకం చేశారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ‘‘జాతీయ భద్రత, రక్షణకై అమెరికా టిక్‌టాక్ యజమానులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్న ట్రంప్ సర్కారు.. 45 రోజుల తర్వాత అమెరికా చట్ట పరిధిలో ఎవరైనా, ఏదైనా ఆస్తికి సంబంధించి బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌తో లావాదేవీలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది.(టిక్‌టాక్ : ట్రంప్ తాజా డెడ్‌లైన్)
కాగా చైనాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో.. ఏదైనా అమెరికన్ కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని ట్రంప్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిక్టాక్ అమెరికా విభాగాన్ని సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. సెప్టెంబరు 15నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.(సెప్టెంబరు 15 నాటికి మైక్రోసాఫ్ట్ చేతికి టిక్టాక్)
Comments
Please login to add a commentAdd a comment