తమిళనాడులోని 20 ఏళ్ల నాటి భవనంతో పాటు 14 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఐటీ కంపెనీ విప్రో ఇటీవల ప్రకటించింది. చెన్నైలోని షోలింగనల్లూరు ఐటీ కారిడార్‌లో దాదాపు 5,89,778 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని రూ. 266.38 కోట్లకు కాసాగ్రాండ్ బిజ్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
విప్రో తన ఆస్తులను విక్రయించిన తరువాత కంపెనీ షేర్స్ అన్నీ కూడా వరుస నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. 2023 - 24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 2870.10 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ. 2563.60 కోట్లు. ఈ లెక్కన 2022 కంటే 2023 లో కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్‌లో 5 లక్షల ఉద్యోగాలు!
విప్రో వంటి పెద్ద సంస్థ తన ఆస్తులను అమ్మడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని వల్ల చాలామందికి కంపెనీ నష్టాల్లో ఉందా అనే ఆలోచన వచ్చింది. ఈ దెబ్బతో షేర్లు క్రమంగా తగ్గాయి. అయితే విప్రో నిజంగా నష్టాల్లో ఉందా.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment