భారత దేశానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో భారీ బృందం స్విట్జర్లాండ్ బయల్దేరింది. దావోస్ నగరంలో 2022 మే 23 నుంచి 25 వరకు జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ఈ బృందం పాల్గొననుంది. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షత జరగున్న జీ 20 దేశాల సదస్సును దృష్టిలో ఉంచుకుని దేశానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ టీమ్ పని చేయనుంది.
దావోస్‌కి వెళ్లిన భారత బృందంలో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మన్‌సుఖ్‌లాల్ మండావియా, హర్‌దీప్‌సింగ్ పూరీలతో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఆంధప్రదేశ్, తెలంగాణలకు చెందిన ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్‌కు చేరుకున్నారు. కాగా తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
ఈ సదస్సులో మంత్రులు, ముఖ్యమంత్రులు సీనియర్ అధికారులతో పాటు ఇండస్ట్రీస్ తరఫున హరి ఎస్ భారతీయ, అమిత్ కళ్యాణి, రాజన్ భారతీ మిట్టల్, రోనీ స్క్రూవాలా, సలిల్ ఎస్ పరేఖ్‌లు సైతం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగం కానున్నారు. పెట్టుబడులకు భారత్‌లో ఉన్న సానుకూల అంశాలు, ఎకో సిస్టమ్, ఇక్కడి పాలసీలను వివరించనున్నారు.
చదవండి: దావోస్ చేరుకున్న సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment