ప్రస్తుతం మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ లలో లాక్/ఆన్ లాక్, వాల్యూమ్ కోసం బటన్లు ఉంటాయి. అలాగే ఛార్జింగ్, మైక్రో ఫోన్, స్పీకర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి మన స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంటుంది. కానీ, షియోమీ సరికొత్తగా రూపొందించే స్మార్ట్‌ఫోన్ లో ఇవేమి ఉండవు. క్వాడ్-కర్వ్డ్ వాటర్ ఫాల్ డిస్‌ప్లే గల కొత్త కాన్సెప్ట్ ఫోన్‌ను షియోమీ ఆవిష్కరించింది. ఈ ఫోన్ లో ఎక్కడా పోర్టులు, బటన్లు లేకుండా నాలుగు వైపులా కర్వ్డ్ ఎడ్జ్ లు ఉండేలా రూపొందించింది. పవర్, వాల్యూమ్ కంట్రోల్, ఇతర వినియోగాలకు టచ్ సెన్సార్లను ఉపయోగించనున్నారు.
దీనిలో ఛార్జింగ్ చేసుకోవడానికి పోర్ట్ లేనందున వైర్‌లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. దీని వెనుక భాగంలో పెద్ద కెమెరాను ఎగువ ఎడమ భాగంలో ఉంచారు. ఈ క్వాడ్-కర్వ్డ్ వాటర్ ఫాల్ డిస్ప్లే కాన్సెప్ట్ ఫోన్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. షియోమీ ఇందులో స్టేటస్ బార్‌ను పక్కకు జరిపింది. దీని కారణంగా ఫోన్ ఎలా ఉందో స్పష్టంగా చూడవచ్చు. ఇందులో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాను తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే షియోమీ దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది కాన్సెప్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. మరి దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారో లేదో తెలియరాలేదు.(చదవండి: పోకో ప్రియులకు శుభవార్త!)
Comments
Please login to add a commentAdd a comment