పాక్‌ జట్టును బీభత్సంగా ట్రోల్‌ చేసిన జోమాటో...! | Zomato Trolls Pakistan Team On Twitter | Sakshi
Sakshi News home page

Zomato: పాక్‌ జట్టును బీభత్సంగా ట్రోల్‌ చేసిన జోమాటో...!

Published Sun, Oct 24 2021 12:09 PM | Last Updated on Sun, Oct 24 2021 1:07 PM

Zomato Trolls Pakistan Team On Twitter - Sakshi

ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది.  టీ20వరల్డ్‌కప్‌-2021లో భాగంగా దుబాయ్‌ వేదికగా నేడు భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌ కోసం ఇరుదేశాల ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దాదాపు 28 నెలల విరామం తర్వాత ఇరు జట్లు తలపడబోతున్నాయి. దాయదుల మధ్య మ్యాచ్‌ జరుగుతుండడంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. 
చదవండి: అదరగొట్టిన టీవీఎస్‌ మోటార్స్‌..!

పాక్‌ను దారుణంగా ట్రోల్‌ చేసిన జోమాటో..!
పాక్‌పై నెటిజన్లు భారీ  ఎత్తున మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తుండగా...వారితో  పాటుగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జోమాటో కూడా చేరింది. జోమాటో తన అధికారిక ట్విట్‌లో...‘ఈ  రోజు(అక్టోబర్‌ 23) రాత్రి బర్గర్‌, పిజ్జా కావాలంటే మాకు చెప్పండి. ఒక్క మేసెజ్‌ చేస్తే అవి మీకు అందుతాయని పాకిస్తాన్‌ క్రికెట్‌ ట్విటర్‌ అధికార ఖాతాను ట్యాగ్‌ చేసి’ పేర్కొంది. అయితే దీని వెనుక కథేమిటంటే... 2019 ప్రపంచకప్‌లో భారత్‌తో పాకిస్థాన్‌ తలపడిన విషయం తెలిసిందే.


ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిపోవడంతో...ఆ దేశానికి చెందిన అభిమాని మోమిన్‌  సాకిబ్‌...‘ఓ బాయ్‌..! మారో మూజే..! ’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ వీడియోలో..‘యే లోగ్‌ కల్‌ రాత్‌  ఐస్‌క్రీమ్‌ ఖా రహే.. బర్గర్‌ ఖా రహే...అసలు పాకిస్థాన్‌ ప్లేయర్స్‌లో ఒక్కరికి కూడా ఫిట్‌నెస్‌ లేదంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరలైంది.  ఇదే సీన్‌ను తన ట్విట్‌ ద్వారా జోమాటో మరోమారు గుర్తుచేసింది. జోమాటో చేసిన ట్విట్‌పై నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. అంతేకాకుండా రీట్వీట్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.

చదవండి: సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న  ఐసీఐసీఐ బ్యాంక్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement