ఎగుమతికి సిద్ధం చేసిన పండ్లను పరిశీలిస్తున్న మధుసూదన్‌రెడ్డి
చిత్తూరు అగ్రికల్చర్: జిల్లా నుంచి విదేశాలకు మామిడి ఎగుమతి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా జిల్లాలో దిగుబడి అఅయ్యే బెనీషా, హిమామ్ పసంద్, మల్లిక లాంటి టేబుల్ వైరెటీ మామిడి పండ్లను పలు దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. దాదాపు రెండు, మూడు నెలలపాటు ఇక్కడి నుంచి విదేశాలకు మామిడిని ఎగుమతి చేస్తారు. అదేతరహాలో ప్రస్తుతం దిగుబడి అయిన మామిడిని 60 టన్నుల మేరకు శుక్రవారం కొరియాకు ఎగుమతి చేయనున్నట్టు ఉద్యానశాఖ డీడీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని వీహెచ్‌టీ కేంద్రంలో సిద్ధం చేస్తున్న పండ్లను ఆయన గురువారం పరిశీలించారు. వీటిని చైన్నెకి తరలించి అక్కడి నుంచి విమానం ద్వారా ఎగుమతి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో విద్యుత్ సమస్యల నమోదు
చిత్తూరు కార్పొరేషన్: ఎస్పీడీసీఎల్ యాప్‌లో విద్యుత్ సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ట్రాన్స్‌కో రూరల్ ఈఈ హరి తెలిపారు. గురువారం ఈఈ కార్యాలయంలో డివిజన్‌లోని సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేటర్లు ఎల్‌సీ తీసుకున్నప్పుడు, సబ్‌స్టేషన్‌లో బ్రేకర్స్, వైర్ పరంగా సమస్యలు వచ్చినప్పుడు వాటిని యాప్‌లో నమోదు చేయాలన్నారు. గతంలో సమస్యలుంటే ఏఈ, డీఈలకు చెప్పేవారని, వారు సంబంధిత విభాగ అధికారులకు విషయం తెలియజేసేవారని చెప్పారు. ఇప్పుడు నూతన విధానం వల్ల సమయం ఆదాతోపాటు సమస్య త్వరగా పరిష్కారమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment