ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి
● రాయలసీమ మాలల జేఏసీ డిమాండ్
బంగారుపాళెం : ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలంటూ రాయలసీమ జేఏసీ డిమాండ్ చేసింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 23న తలపెట్టిన ‘రాయలసీమ మాలల సింహగర్జన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక దళితవాడలో సోమవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ చైర్మన్ చంద్రయ్య మాట్లాడుతూ.. ఒకే కులానికి ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు సై అంటూ జైకొట్టి రాజకీయ లబ్ధిపొందాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 23న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో నిర్వహించనున్న రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు ధనశేఖర్, శివ, సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment