పరీక్ష కేంద్రం తనిఖీ
చిత్తూరు అర్బన్ : నగరంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను ఎస్పీ మణికంఠ తనిఖీ చేశారు. సోమవారం నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణను పరిశీలించిన ఆయన.. అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, బందోబస్తును తనిఖీ చేశారు. పరీక్షలు పారదర్శకంగా జరగడానికి పిల్లల తల్లిదండ్రులు, అధ్యాపకులు సహకరించాలని కోరారు.
ఇరువర్గాల ఘర్షణ..కత్తితో దాడి
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తులతో దాడులు చేసుకున్నారు. వన్‌టౌన్ సీఐ జయరామయ్య కథనం మేరకు.. దుర్గానగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చామంతిపురంలోని ఓ సూపర్ మాల్‌లో పనిచేస్తున్న తేజ, పాండ్య, మల్లికార్జునకు .. మోహన్‌కు పాత గొడవల విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత దుర్గా నగర్ కాలనీలోని మోహన్ ఇంటికి వద్దకు వెళ్లి, అతడి తల్లిపై తేజ దాడి చేశాడు. ఆ సమయంలో మోహన్ ఇంటి వద్ద లేకపోవడంతో అతడి సోదరుడు రాజేష్ తదితరులు చామంతి పురం ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న తేజ , పాండియన్, మల్లికార్జున్ పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి రక్త గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment