గోల్డ్ లోన్ బ్యాంకు అక్రమాలపై కేసు
● కనకదుర్గ గోల్డ్‌లోన్ బ్యాంకులో రూ.కోట్లలో మోసం ● పలమనేరు బ్రాంచి సిబ్బందిపై విచారణ
పలమనేరు : పలమనేరులోని కనకదుర్గ గోల్డ్‌లోన్ బ్యాంకులో రూ.కోట్లలో జరిగిన అక్రమాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఇదే బ్యాంకు పుంగనూరు బ్రాంచిలో బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు బ్యాంకు సిబ్బందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడి బ్రాంచి అక్రమాలపై ఫిర్యాదు రాక పోలీసులు ఇప్పటి దాకా వేచి చూశారు. సోమవారం దీనిపై ఫిర్యాదు అందడంతో స్థానిక పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆడిట్‌లో వెలుగుచూసిన అక్రమాలు...
పుంగనూరు, పలమనేరులోని గోల్డ్ పట్టణాల్లో గ్రాముకు ఎక్కువ ధరతో రుణాలిస్తామంటూ వీరు రూ.8 కోట్ల అక్రమాలకు పాల్పడగా ఇందులో పలమనేరులో జరిగిన అక్రమాలు రూ.2.80 కోట్లగా ఉన్నట్లు ఆడిట్‌లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై పుంగనూరులో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇప్పుడు పలమనేరులోనూ ఫిర్యాదులు రావడంతో ఇక్కడి బ్రాంచి అక్రమాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఇదంతా ఇంటి దొంగలపనేని విష యంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment