● స్క్వాడ్ తనిఖీలో దొరికి జైలుకు
పుంగనూరు/ గంగాధర నెల్లూరు : ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో పుంగనూరు, గంగాధర నెల్లూరులో అక్రమాలు వెలుగుచూశాయి. పుంగనూరు జెడ్పీ బాలికల హైస్కూల్‌లో ఒక విద్యార్థి పేరుతో మరొక విద్యార్థి పరీక్ష రాస్తూ అడ్డంగా దొరికిపోయిన సంఘటన సోమవారం జరిగింది. పట్టణంలోని బసవరాజ హైస్కూల్, జెడ్పీ బాలికల హైస్కూల్ ,కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్‌లో తొలిరోజు పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో చౌడేపల్లెకి చెందిన వంశీకృష్ణ ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ అతని పేరుతో మదనపల్లెకి చెందిన అతడి స్నేహితుడు ప్రవీణ్‌కుమార్ పరీక్షరాస్తూ స్క్వాడ్ తనిఖీలో పట్టుబడ్డాడు. వెంటనే నకిలీ విద్యార్థి వద్ద పరీక్ష పత్రాలు తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు పరీక్ష కేంద్రానికి వెళ్లి నకిలీ విద్యార్థిని అదుపులోనికి తీసుకుని స్టేషన్‌కు తరలించి, నకిలీ విద్యార్థితో పాటు మరో విద్యార్థిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై జెడ్పీ బాలికల హైస్కూల్‌లో పరీక్ష నిర్వాహకులపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
అభ్యర్థి ఒకరు..పరీక్షకు మరొకరు..
ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఇన్విజిలేటర్‌కు అడ్డంగా దొరికిపోయిన అభ్యర్థిపై కేసు నమోదు చేసిన సంఘటన గంగాధర నెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో సోమవారం ఓ వ్యక్తికి బదులు మరొక వ్యక్తి పరీక్ష రాయడానికి వచ్చి ఇన్విజిలేటర్‌కు దొరికిపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయకుమార్ అనే వ్యక్తి తన ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షను దేవేంద్ర నాయుడు అనే వ్యక్తిని పంపించి పరీక్ష రాయడానికి ప్రయత్నించగా ఇన్విజిలేటర్‌కు దొరికిపోవడంతో ఈ సంఘటన బయటపడింది. జయకుమార్.. కొండేపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సతీష్ పూర్వ స్నేహితులు కావడంతో కొండేపల్లి గ్రామంలో చదువుకుని నిరుద్యోగిగా ఉన్న దేవేంద్ర నాయుడుకు కొంత డబ్బు ఇచ్చి పరీక్ష రాయడానికి సన్నద్ధం చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ సందర్భంగా దేవేంద్ర నాయుడు ఏ–1 గా, ఏ–2 జయకుమార్ ,ఏ–3 గా సతీష్ పై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసంతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment