
పలమనేరులో కానరాని బంద్ జాడ
సాక్షి, చిత్తూరు : చంద్రబాబుకు ఏసీబీ కోర్డు రిమాండ్ విధించిన నేపథ్యంలో టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ జిల్లాలో తేలిపోయింది. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖ 144 సెక్షన్ అమలు చేయడంతో తమ్ముళ్ల ఓవర్‌యాక్షన్‌కు తెరపడింది. తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో బంద్ ప్రభావం కనిపించలేదు. జిల్లావాసులు తమ దైనందిన కార్య కలాపాలను యధావిధిగా సాగించారు. పోలీసుల అప్రమత్తపై ప్రశంసలు కురిపించారు. చివరకు చంద్రబాబుకు చెందిన సొంత సంస్థ హెరిటేజ్ సైతం మూతపడకపోవడం గమనార్హం.
● కుప్పం నియోజకవర్గంలో బంద్ ప్రభావం పెద్దగా లేదు. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు కొన్నిచోట్ల దాడులకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో దుకాణాలు తెరుచుకున్నాయి.
● చిత్తూరు నియోజకవర్గంలో బంద్ ప్రభావం కనిపించలేదు. దుకాణాలను బలవంతంగా మూయించేందుకు యత్నించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనజీవనం సాధారణం.
● పలమనేరులో బంద్ ప్రభావం లేదు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు మామూలుగానే రాకపోకలు సాగించాయి. దుకాణాలు మూతపడలేదు. వ్యాపారాలు సాధారణంగానే నడిచాయి.
● జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బంద్ చేయించేందుకు విఫలయత్నం చేశారు.
● పూతలపట్టులో అల్లర్లు సృష్టించేందుకు యత్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో బంద్ ప్రభావం కనిపించలేదు.
● నగరిలో బంద్ కనిపించలేదు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు యధావిధిగా నడిచాయి.
● పుంగనూరులో బంద్ ఊసేలేదు. దుకాణాల్లో వ్యాపారాలు జోరుగా సాగాయి. జన జీవనం మామూలుగా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment