వైద్యసేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● వైద్యశాఖ సమావేశంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలందించడంలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ అమల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పకడ్బందీగా వైద్యసేవలందించాలన్నారు. రోగులకు వైద్యసేవలందించే విషయంలో ఆరోగ్యమిత్రలు కచ్చితంగా నియమ, నిబంధనలు పాటించాలని తెలిపారు. ఎక్కడైనా అలసత్వం వహిస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందే రోగుల నుంచి నగదు రహిత వైద్యం అందించేలా ఆరోగ్యమిత్రలు చర్యలు చేపట్టాలన్నారు. రోగుల వైద్య సేవల సమాచారం ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్యమిత్రలు సమయపాలన పాటించి, విధులను బాధ్యతతో నిర్వర్తించాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డా.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment