
నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకై నా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమవుతున్నాయి. ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు.. విద్యా బుద్దులు నేర్పించే గురువులు.. వయస్సుతో సంబంధం లేకుండా ఆకృత్యాలకు ఒడిగడుతున్నారు. ముక్కు పచ్చలారని బాలికలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. మూడు రోజుల కిందట పలమనేరులో జరిగిన బాలిక మృతి కలకలం రేపింది. ఇలాంటివి ఒకటి కాదు.. జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు రెచ్చిపోతున్న మానవ మృగాలు చిట్టి తల్లులకు కడుపుకోత.. అమాయక, పేదరిక బాలికలే లక్ష్యం చిన్నతనంలోనే అమ్మలవుతున్న వైనం కఠిన చర్యలు తీసుకోని అధికారులు
కాణిపాకం /చిత్తూరు అర్బన్: జిల్లాలో 15 అర్బన్ హెల్త్ సెంటర్లు, 50 పీహెచ్‌సీలున్నాయి. వీటి పరిధిలో గత 8 నెలల కాలంలో 27,378 మంది గర్భిణులు నమోదయ్యారు. ఇందులో 2,793 మంది టీనేజీ గర్భిణులను పీహెచ్‌సీ వైద్యాధికారులు గుర్తించారు. ఏమీ తెలియని వయస్సులో గర్భిణులు కావడం.. ఇవేమీ బయటకు తెలియకుండానే కేసులు సంఖ్య జిల్లాలో విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది తెలిసి అబార్షన్లు చేయించుకుంటున్నారు. తెలియక చాలా మంది నెలలు గడవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో తల దాచుకుంటున్నారు. ఇలాంటి కేసులు జిల్లాలో ప్రతి నెలా పదుల సంఖ్యలో బయట పడుతున్నాయి. కొంత మంది తల్లిదండ్రులు పరువు పోతుందని భావించి గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోతున్నారు. కొంతమంది పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొంత మంది వివిధ కారణాలతో బయట పడుతున్నారు.
టీనేజీ తల్లుల నమోదు అధికం
కొన్ని పీహెచ్‌సీ పరిధిలో టీనేజీ గర్భిణుల సంఖ్య పెరుగుతోంది. 8 నెలల కాలంలో అధికారికంగా గుడిపల్లె పీహెచ్‌సీ పరిధిలో 111, ఒగులో 198, పెద్దపంజాణి 84, రామకుప్పం70, కొలమాసనపల్లి 72, ముడిపాపనపల్లి 93, తుంబకుప్పం 105, పైపాళ్యం 88, పలమనేరు, బైరెడ్డిపల్లి, విజయపురం, పాతపేట, మల్లనూరు, రాళ్లబగుదూరు, రాయల్‌పేట, గంగవరం, పచికాపలం, కార్వేటినగరం, తవణంపల్లి తదితర పీహెచ్‌ల పరిధిలో సంఖ్య 50 దాటుతోంది. ఆయా ప్రాంతాల్లో ఈ కేసులను తగ్గించేందుకు అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ కారణంగా మాతా, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిపై ప్రతి నెలా సమీక్షలు చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
చెడు వ్యసనాలు, పెద్దల భయం లేకపోవడం
ఉచిత అంతర్జాలం, సినిమాల ప్రభావం, చెడు వ్యసనాలు తదితర కారణాలతో కొందరు మగాళ్లు మృగాలుగా మారుతున్నారు. బాధ్యతలు తెలియకపోవడం, పెద్దల భయం లేకపోవడం, అధికంగా యువకులే ఇలాంటి వాటికి పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చట్టలు ఏం చేస్తాయనే ధీమాతో లైంగిక దాడులకు ఒడిగడుతున్నారు. ఇక బాలికలకు సైతం సమాజంపై సరైనా అవగాహన లేక గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.
కుటుంబ సభ్యులు గుర్తించి .. చెప్పాల్సినవి..
బాలికల అమాయకత్వం
వెంటాడుతున్న పేదరికం, నిరాక్షరాస్యత
తల్లిదండ్రుల పిల్లలకు శరీర భద్రత గురించి అవగాహన కల్పించాలి.
చిన్న వయసు నుంచే సొంతంగా మల, మూత్ర విసర్జనకు వెళ్లడం నేర్పించాలి.
శరీరంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చదువుకోలేని అమ్మాయిలకు చెప్పడం.
సహజంగా తాకడానికి ఉద్దేశపూర్వకంగా తగలడానికి ఉండే వ్యత్యాసాన్ని వివరించి చెప్పాలి.
ఎవరైనా అభస్యంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులకు చెప్పమనాలి.
తమతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు గట్టిగా అరవడం ద్వారా చుట్టుపక్కల వారి సాయం పొందాలని వివరించాలి.
తల్లిదండ్రులకు తెలియకుండా ఎంత తెలిసిన వారివెంటైన వెళొద్దని చెప్పాలి.
ఆత్మరక్షణ విద్య కచ్చితంగా నేర్పించాలి.
మాయమాటలకు మోసపోతున్నారు..
పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడినా కొంత మంది మానవ మృగాలుగా మారి కాసుకు కూర్చుంటున్నారు. సమాజంలో బాలికపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వీటిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి రోజు పిల్లల కోసం సమయం కేటాయించి..తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. మాయమాటలకు మోసపోకుండా చూడాలి. చాకెట్లు, బిర్యానీలు, ఇష్ట్టమైన తినుబండారాలు ఇచ్చి మాయలోకి దింపుతారు. జాగ్రత్తగా ఉండాలి.
– మల్లికార్జున, తాలూకా ఎస్‌ఐ, చిత్తూరు
ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు
పిల్లల చుట్టూ ఉన్న అపరిచితులను గుడ్డిగా నమ్మరాదు. ఎదుటి వ్యక్తి వింత ప్రవర్తనను పసిగట్టాలి. పిల్లలు బాధపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి స్నేహితుడో, కుటుంబ సభ్యుడో, జీవిత భాగస్వామినో అయితే పిల్లల భద్రత, వారి ఆనందం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లలకు శరీరంలోని కొన్ని ప్రాంతాలు వారి సొంతమనే భావనను పెంపొందించాలి. భయపెడితే భయపెట్టిస్తారు.
– జయప్రియ, మానసిక వైద్యులు, చిత్తూరు
ప్రాణానికే ప్రమాదం
బాధ్యత తీరిపోతుందని చాలా మంది 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేస్తున్నారు. మరికొంత మంది మాయగాళ్ల వలలో పడి చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తున్నారు. మరికొంత మంది ప్రస్తుత ప్రభావంతో దారి తప్పు తి గర్భిణులవుతున్నారు. ఇది చట్టరీత్యానేరం. అయినా ఈ విషయాన్ని మరిచిపోతున్నారు. చిన్నతనంలో తల్లులువుతున్నారు. శారీరక సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.
– ప్రభావతి, డీసీహెచ్‌ఎస్, చిత్తూరు
లైంగిక దాడుల నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందింది. జూన్ 20న గెజిట్లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపకపోయినా 18 ఏళ్ల లోపు ఏ వ్యకి అయినా లైంగిక కలయిక జరిగితే అది లైంగిక దాడిగానే పరిగణించబడుతుంది. ఇప్పటి వరకూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ప్రకారం 16 సంవత్సరాలలోపు వ్యక్తి ఆమోదం తెలిపినా, తెలపకపోయినా అది లైంగిక దాడిగా పరిగణించబడుతుంది. కానీ, ఇప్పుడు కొత్త చట్టం, నిబంధనల ప్రకారం అది 18 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తికై నా వర్తిస్తుంది.
టీనేజీ గర్భిణుల సమస్యలు ఇలా..
మాతా శిశుమరణాలు సంభవిస్తాయి..
నెలలు నిండకనే పుడుతారు
బరువు తక్కువగా పుట్టడం
ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం
శారీరక లోపాలు
కడుపు కోతలుంటాయి..మరిన్ని అనారోగ్య సమస్యలు తప్పవు.

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు
Comments
Please login to add a commentAdd a comment