పలమనేరు : మండలంలో పదో తరగతి చదువుతున్న బాలిక మృతిపై స్థానిక డీఎస్పీ ప్రభాకర్, సీఐ నరసింహరాజు బుధవారం గ్రామంతో పాటు బాలిక చదివిన పాఠశాలలో విచారించారు. బాలిక తొమ్మిదినెలల గర్భం దాల్చినా ఎందుకు గుర్తించలేదని అక్కడి టీచర్లును ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దీంతోపాటు స్థానిక ఐసీడీఎస్ సీడీపీఓ ఇందిరా, ఐసీపీస్ అధికారులు గ్రామంలో జరిగిన సంఘటనపై సమగ్రంగా విచారించారు.
డీఎన్‌ఏ టెస్ట్ చేశాకే నిందితుల అరెస్ట్
ఇప్పటికే అనుమానితులుగా పోలీసుల విచారణ చేస్తున్న వారి డీఎన్‌ఏ, బాలిక ప్రసవించిన బాబు డీఎన్‌ఏను విజయవాడలోని ల్యాబ్‌లో పరిశీలించాక పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు వీలుంటుంది.
అనుమానితులు టీడీపీ సానుభూతి పరులేనా?
బాలిక మృతి కేసులో అనుమానితులుగా ఉంటూ పో లీసులు కస్టడీలో ఉన్న ఇరువురు తాపీ పనులు చేసుకొ నే వ్యక్తులు గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి ప రులుగా తెలుస్తోంది. ఈ కారణంగానే కూటమి నేత లు, స్థానిక ఎమ్మెల్యే గానీ కనీసం బాధితులను పరా మర్శించేందుకు సైతం రాలేదనే మాట వినిపిస్తోంది.
కోలుకుంటున్న శిశువు
తిరుపతి తుడా: పలమనేరు మండలంలో నవజాత శిశువుకు జన్మనిచ్చి బాలిక మృతి చెందడం తెలిసిందే. ఆ శిశువుకు తిరుపతి రుయాలో వైద్యులు మె రుగైన చికిత్స అందిస్తున్నారు. తొలి రెండు రోజులు చిన్నారి ఆరోగ్యం కుదుటపడడం కష్టతరంగా ఉందని వైద్యులు భావించారు. నెలలు నిండకనే జన్మించడం, బరువు తక్కువగా ఉండడం వంటి కారణాలను గుర్తించారు. ప్రస్తుతం ఆరోగ్యం కొంత కుదుటపడుతోందని తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడడంతో మధ్యాహ్నం వెంటిలేటర్ సహాయాన్ని తొలగించి సీటాప్ మిషన్‌పై వైద్యం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment