పకడ్బందీగా ఇంటర్వ్యూలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖలోని పలు పోస్టులకు పకడ్బందీగా ముఖాముఖి నిర్వహించారు. గురువారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ ఇంటర్వ్యూలు చేపట్టారు. ఐసీడీఎస్ పరిధిలోని మిషన్ వాత్సల్య పథకంలోని కౌన్సిలర్, ఔట్ రీచ్ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్యర్థుల నైపుణ్యాలను ట్రైనీ కలెక్టర్ ప్రశ్నల రూపంలో ఇంటర్వ్యూ చేశారు. మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment