వృత్తి విద్యకు ప్రోత్సాహకం
రొంపిచెర్ల : వృత్తి విద్య కోర్సులు ప్రతి విద్యార్థికి అవసరమని మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయపూర్ పీఎంశ్రీ కార్యాలయం పరిపాలనాధికారి అజిత్మిస్ట్రా అన్నారు. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు రెండు రోజుల కిందట వచ్చారు. మంగళవారం విద్యార్థులతో మాట్లాడుతూ.. వృత్తి విద్య ఎంతో అవసరమని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అర్థిక సాయం అందిస్తోందన్నారు. పదో తరగతి విద్యార్థుల వృత్తి విద్య దస్త్రాలను , ప్రాక్టికల్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు వైవా అంశాలను పరిశీలించి మదింపు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మోహన్ రెడ్డి, వృత్తి విద్య ఉపాధ్యాయులు శశికుమార్, దినేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment