ఆకతాయికి దేహశుద్ధి
ఐరాల : బ్యాంకుకొచ్చే మహిళా ఉద్యోగులను నిత్యం వేధిస్తున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసిన సంఘటన మంగళవారం మండలంలోని వైఎస్ గేటులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కాణిపాకానికి చెందిన ఆకతాయి భూపాల్ వైఎస్ గేటులోని ఓ బ్యాంకు మహిళా ఉద్యోగులు చిత్తూరు నుంచి వైఎస్ గేటుకు ఆర్టీసీ బస్సులో వచ్చే సమయంలో నిత్యం వేధించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆకతాయి మహిళా ఉద్యోగులను వేధించడంపై ఆగ్రహించిన స్థానికులు ఆకతాయిని బంధించి అక్కడే కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దీనిపై ఆకతాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
సామాజిక మాధ్యమాలకు బానిస కావొద్దు
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్. ప్రభావతి అన్నారు. మంగళవారం నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో సంసిద్ క్యాంఫోర్డ్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అతిథిగా పాల్గొన్న డీసీహెచ్‌ఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి నైతిక విలువలను పెంపొందించాలన్నారు. ఉన్నత ఆశయంతో విద్యార్థులు ముందుకు సాగేలా టీచర్లు బోధన చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే బాలికలకు గుడ్‌టచ్..బ్యాడ్ టచ్‌పై అవగాహన పెంపొందించాలని తెలిపారు. అనంతరం ఆ పాఠశాల విద్యార్థులు చేసిన వ్యవసాయం, రైతుల గొప్పదనాన్ని తెలియజేసే విధంగా చేసిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మహేష్, పాఠశాల అధినేత శ్రీనివాసరావు, డైరెక్టర్ మాధవి, చైర్‌పర్సన్ కీర్తి, ప్రిన్సిపల్స్ కేశవులు, కవిత, అరుణ్, వినోద్ పాల్గొన్నారు.
ముగ్గురు ఎస్జీటీలను పంపాలని ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు జిల్లా నుంచి ముగ్గురు ఎస్జీటీలను పంపాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వులు మంగళవారం డీఈఓ కార్యాలయానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో విద్యా సమీక్ష కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ముగ్గురు ఎస్జీటీలను పంపాలన్నారు. కంప్యూటర్ స్కిల్స్, గణితంలో ప్రావీణ్యం ఉన్న వారిని పంపించాలంటూ డీఈఓను ఆదేశించారు.
ఆకతాయికి దేహశుద్ధి
Comments
Please login to add a commentAdd a comment