కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి భీమారావు పేర్కొన్నారు.
స్త్రీ,శిశు సంక్షేమమే ధ్యేయం
గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
● పలమనేరు మండలంలోని ఓ గ్రామంలోని బాలిక గర్భిణి అయింది. మూడు రోజుల కిందట మూర్చ వచ్చి చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తీసుకొస్తే ఆరు నెలల గర్భిణిగా గుర్తించారు. ప్రమాదకర స్థితిలో ఉండడంతో వైద్యులు వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఆపై పోలీసులు పొక్సో నమోదు చేశారు. ఈ బాలిక గర్భిణి కావడానికి ముగ్గురు వ్యక్తులు, ఓ మహిళ కారణమని గుర్తించినట్లు తెలిసింది.
● చిత్తూరు నగరంలోని ఓ కాలనీకి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. తాను పనికి వెళ్లి వచ్చేసరికి, బాలిక ఏడుస్తోందని.. అడిగితే తనపై వెంకటేష్ లైంగిక దాడికి ప్రయత్నించాడని బాలిక చెప్పిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, పిల్లలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పొక్సో) కింద కేసు నమోదు అయింది.
● చైన్నెకు చెందిన ఓ మహిళ పొట్టకూటి కోసం దుబాయ్ వెళుతూ ఇటీవల తన ఆరేళ్ల కుమార్తెను చిత్తూరు నగరంలోని తన స్నేహితురాలి ఇంట్లో వదలి వెళ్లింది. చిన్నారిపై దాడి చేయడం, ఆమె భర్త లైంగిక దాడికి పాల్పడ్డట్లు గుర్తించిన బాధితురాలి తల్లి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశారు.
● ఇటీవల చిత్తూరులో ఓ ఆర్‌ఎంపీ 17 ఏళ్ల ౖబాలికను నమ్మించి పనిలో పెట్టుకున్నాడు. నాలుగేళ్లుగా బాలికపై లైంగికదాడి చేస్తుండటంతో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడుగానీ తల్లిదండ్రులకు విషయం తెలియలేదు. ఆర్‌ఎంపీని అరెస్టు చేసినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
● చిత్తూరు నగరంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని,. ఆరు నెలలుగా బ్యాడ్ టచ్ చేస్తున్నాడని పలువురు ఉపాధ్యాయులు గుర్తించి కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులను కీచక ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని ఆదేశించారు. ఈ మేరకు స్పందించిన అధికారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉపాధ్యాయుడిపై ఈనెల 6వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆపై అతడిని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment