అనుచితం..
●
టీటీడీ పాలకమండలి సభ్యుడి అనుచిత వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో దుర్భాషలాడడంపై మండిపడుతున్నారు. భక్తుల సేవలో నిమగ్నమైన ఉద్యోగిని అవహేళన చేయడంపై ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తుంటే దౌర్జన్యం చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగిని అవమానించిన బోర్డు మెంబర్ నరేష్‌కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసనకు దిగనున్నట్లు స్పష్టం చేశారు.
టీటీడీ ఉద్యోగిని దూషిస్తున్న బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ (ఫైల్)
పవిత్రతను కాపాడాలి
టీటీడీ ఉద్యోగిపై దౌర్జన్యా నికి పాల్పడిన బోర్డు సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా భక్తుల్లో ఆఽత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం టీటీడీ యాజమాన్యం, ప్రభుత్వంపై ఉంది. అత్యున్నత స్థాయి పాలక మండలిలో సభ్యుడై ఉండి కనీస మర్యాద పాటించకుండా బూతులు మాట్లాడడం అత్యంత దుర్మార్గం. ఏళ్ల తరబడి భక్తుల సేవలో ఉన్న ఉద్యోగుల పట్ల సద్భావంతో వ్యవహరించి టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది.
– కందారపు మురళి,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి.
తిరుపతి కల్చరల్ : పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి బాలాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ తీరును వ్యతిరేకిస్తూ గురువారం నిరసనకు దిగనున్నట్లు టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఈమేరకు బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీడీ వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘ నేతలు మాట్లాడారు. టీటీడీ బోర్డు ఆదేశాల మేరకు తిరుమలలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. టీటీడీ నిబంధనలను మేరకు పనిచేస్తూ భక్తులకు నిరంతరం సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. పవిత్రమైన టీటీడీ బోర్డులో స్థానం దక్కిన బోర్డు సభ్యులు సైతం నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ కేవలం రెండు నిమిషాల్లో ఆలయ మహద్వారం ఎగ్జిట్ గేటును తీయలేదని ఓర్పును కోల్పోయి అసభ్యంగా మాట్లాడుతూ ఉద్యోగి బాలాజీని అవమానించడం దుర్మార్గమన్నారు. గత మూడు నెలలుగా ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావడంతో ఉద్యోగులు బలవుతున్నారని వాపోయారు. భవిషత్తులో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా సమష్టిగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన టీటీడీ బోర్డు సభ్యుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌తో నిరసన చేపడుతు న్నట్లు ప్రకటించారు. ఉద్యోగిపై టీటీడీ బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరును పలువురు విమర్శించారు.
టీటీడీ బోర్డు సభ్యుడి వ్యవహారశైలిపై ఉద్యోగుల ఆగ్రహం
తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నేడు పరిపాలన భవనం ఎదుట నిరసన
దుర్భాషలు హేయం
రాత్రి, పగలు విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలు అందించే టీటీడీ ఉద్యోగులను అవహేళనంగా దుర్భాషలాడి అవమానించడం హేయం. మహద్వారం ఎగ్జిట్ గేటు తీయకూడదని టీటీడీ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. అధికారుల ఆదేశాలను పాటిస్తే తప్పుగా భావిస్తూ సహనం కోల్పోయి ఉద్యోగిని అందరి ముందు తిట్టడం సరికాదు. ఇలాంటి చర్యలను ఉద్యోగులు ఖండించకపోతే భవిషత్తులో వారిపై చులకన భావనం పెరిగే ప్రమాదం. ఉద్యోగిని తిట్టిన టీటీడీ బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తాం. – హేమలత, టీటీడీ
పద్మావతి మహిళా అసోసియేషన్ అధ్యక్షులు
క్షమాపణ చెప్పాలి
సనాతన ధర్మాన్ని పాటి స్తూ ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించాల్సిన టీటీడీ బోర్డు సభ్యుడు విధి నిర్వహణలో ఉన్న టీటీడీ ఉద్యో గి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణం. మహద్వారం గేటు తీయడంలో ఆలస్యం చేశారన్న నెపంతో నిగ్రహాన్ని కోల్పోయి అందరి ముందు బూతులు తిడుతూ హేళనం చేయడమేకాక ఆలయం వెలుపలకు వెళ్లిపో అని హెచ్చరిక చేయడం హేయమైన చర్య. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.
– పి.మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి
కించపరచడం తగదు
నిరంతరం భక్తులకు సేవలందిస్తూ విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగి బాలాజీని టీటీడీ బోర్డు సభ్యుడు సహనానం కోల్పోయి కించపరచడం తగదు. ఆది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. టీటీడీ ఉద్యోగులను అమానించే తీరుకు అందరూ స్వస్తి పలకాలి. ఇలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకొని ఉద్యోగుల్లో భద్రతా భావాన్ని పెంచేందుకు కృషి చేయాలి.
– వంకీపురం పవన్, కల్యాణ కట్ట
నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు
అనుచితం..
అనుచితం..
అనుచితం..
అనుచితం..
Comments
Please login to add a commentAdd a comment