ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

Published Thu, Feb 20 2025 9:02 AM | Last Updated on Thu, Feb 20 2025 8:57 AM

ఫస్ట్

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

పొరపాట్లకు తావివ్వొద్దు..
పది, ఇంటర్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు.
● ఆర్టీసీ బస్సుల్లో ఖాళీ పెట్టెలు ● అలంకారప్రాయంగా ప్రథమ చికిత్స బాక్సులు ● ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స.. గోవిందా.. ● మోటారు వాహన చట్టానికి ఆర్టీసీ అధికారుల తూట్లు ● పట్టించుకోని రవాణా అధికారులు

పార్టీకో నిబంధన

పార్టీలను అనుసరించి రెవెన్యూ అధికారులు నిబంధనలు మారుస్తుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

చిత్తూరు రూరల్‌(కాణిపాకం) : ఆర్టీసీలో సురక్షిత ప్రయాణమే లక్ష్యం అనే నినాదం బాగున్నా.. కనీసం పాటించాల్సిన ప్రథమ చికిత్స బాక్స్‌లు ఔషధాలు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సుల నిర్వహణలో లోపాలు తేటతెల్లమవుతున్నాయి. ప్రధానంగా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు ఆర్టీసీలో అలంకారప్రాయంగా మారాయి. దీంతో ప్రమాద సమయంలో ప్రథమ చికిత్స దిక్కే లేకుండా పోయింది. మోటారు వాహన చట్టానికి ఆర్టీసీ అధికారులు తూట్లు పొడుస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.

నిధులు లేక..

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స ఎంతో అవసరం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి 15 నిమిషాలు ఎంతో విలువైనది. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలంటే ఆ సమయంలో చేసే చికిత్స ఎంతో కీలకం. దీని కోసమే అన్ని వాహనాల్లోనూ ప్రథమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం వీటి నిర్వహణ అధ్వానంగా మారింది. పలు బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సుల్లో అవసరమైన మందులు మచ్చుకై నా కనిపించడం లేదు. కొన్ని బస్సుల్లో గడువు తీరిన మందులు, మరికొన్ని బస్సుల్లో ఖాళీ బాక్సులు, ఇంకొన్ని బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుల్లో ఇతర వస్తువులు కనిపిస్తున్నాయి.

ప్రథమ చికిత్స

బాక్సులో

ఉండాల్సినవి..

ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సిన సామగ్రి 17 రకాల దాకా ఉన్నాయి. ఎలాస్టిక్‌ బ్యాండేజ్‌ రోలర్స్‌ 5, బెటాడిన్‌ అయింట్‌మెంట్‌, డెటాల్‌ లేదా ఐయోడిన్‌, స్టెరిలైజ్డ్‌ కాటన్‌ బండిల్స్‌, నియోసిన్‌ పౌడర్‌ డబ్బా, సర్జికల్‌ బ్లేడ్‌, బర్నాల్‌ ఆయింట్‌ మెంట్‌, వాటర్‌ ప్రూఫ్‌ ప్లాస్టర్‌, బ్యాండ్‌ ఎయిడ్‌ ప్లాస్టర్లు, నైట్రోజన్‌, పెరాక్సైడ్‌, దూది, స్పిరిట్‌, పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు, కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలకు మాత్రలు తదితరాలు అందులో ఉండాలి.

అలసత్వంలో అధికారులు

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుల్లో మందులు ఏర్పాటు చేయకపోతే బస్సులను సీజ్‌ చేసే అధికారం ఆర్టీఓ స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ నిర్వహణలో ఉన్న వాటిని ప్రభుత్వ బస్సులేనన్న భావనతో రవాణా అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. అనుమతుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అలంకారప్రాయంగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఆ తర్వాత మళ్లీ కనిపించవు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిస్పెన్సరీ ఉంది. అవి లేని చోట జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ప్రథమ చికిత్స బాక్సుల్లో మందులు పెట్టాల్సి వస్తే ఆస్పత్రులకు ఇండెంట్‌ పెట్టి తీసుకోవచ్చు. అయినప్పటికీ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు.

జిల్లాలోని ఆర్టీసీ బస్సుల వివరాలు..

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేం.. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందుకు తగ్గ ఏర్పాట్లు ఆర్టీసీ అధికారులు చేసుండాలి. అర్ధరాత్రి సమయాల్లో ప్రమాదం జరిగితే ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌లో కనీసం దూది కూడా ఉండడం లేదు. రోజు లక్షల సంఖ్యలో ప్రయాణిస్తున్న బస్సుల్లో ఇంత నిర్లక్ష్యం కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. వీటిని ప్రతినెలా పర్యవేక్షించాల్సిన రవాణా అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి మమ అనిపిస్తుండడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిపోల సంఖ్య 5

మొత్తం బస్సుల సంఖ్య 400

పల్లెవెలుగు 233

ఎక్స్‌ప్రెస్‌ 100

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ 33

సూపర్‌లగ్జరీలు 30

ఇంద్ర 04

రోజువారి తిరిగే కి.మీ 1.50 లక్షలు

రాకపోకలు సాగించే

ప్రయాణికుల సంఖ్య

1.11 లక్షలు

మొక్కుబడిగా పెట్టి.. వదిలేయడం

కేంద్ర మోటారు వాహన చట్టం 1939 ప్రకారం ప్రయాణికుల వాహనాల్లో విధిగా ప్రథమ చికిత్స బాక్సులు ఏర్పాటు చేయాలి. ఈ చట్టాన్ని మరింత పటిష్ఠం చేస్తూ 1988లో మరిన్ని సవరణలు చేశారు. నిబంధనల ప్రకారం ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వస్తువులను బాక్సుల్లో ఉంచాలి. లైసెన్సు పొందే ముందు బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ తప్పనిసరిగా వారం రోజుల పాటు ప్రథమ చికిత్స చేయడంపై శిక్షణ పొందాలని, ప్రతి మూడేళ్లకోసారి లైసెన్సును పునరుద్ధరించుకోవాలని చట్టం నిర్దేశిస్తుంది. ప్రయాణికులు గాయపడితే వారికి ప్రథమ చికిత్స చేసే సామర్థ్యం బస్సు డ్రైవర్‌, కండక్టర్లకు ఉంటుంది. రవాణా శాఖ అధికారుల నుంచి బస్సులకు ఫిటెనెస్‌ సర్టిఫికెట్‌ పొందే సమయంలో మాత్రమే మొక్కుబడిగా ప్రథమ చికిత్స కిట్లను చూపుతున్నారు. ఆ తర్వాత వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. బస్సులు నడిపేటపుడు అకస్మాత్తుగా బ్రేక్‌ వేస్తే ఒక్కోసారి కొందరు ప్రయాణికులు గాయపడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు ప్రథమ చికిత్స కిట్టు ఉంటే కొంతమేర ఉపశమనం ఉంటుంది.

ప్రైవేటు అంబులెన్స్‌ల కోసం ..

ఆర్టీసీ బస్సుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేటు అంబులెన్సులు, ఆటోలు,108 వాహనాల కోసం ఎదురుచూడడం తప్ప మరో దారి లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సుల్లో ఔషధాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రమాదం జరిగితే అంతేసంగతి..

ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెల్లో ఔషధాలు ఉండడంలేదు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న బస్సుల్లోనే నిబంధనలు పాటించకపోతే ప్రైవేటు బస్సుల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందనేది వాస్తవం. ప్రయాణికుల భద్రతకు నిజంగా విలువనిస్తే ఆర్టీసీ అధికారులు వెంటనే ప్రథమ చికిత్స పెట్టెల్లో అవసరమైన మందులు ఉంచడంతో పాటు, నిర్వహణ సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలి.

– బాలాజీ, చిత్తూరు

డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి

ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల్లో అవసరమైన మందులు ఉండేలా డ్రైవర్లు, కండక్టర్లకు సూచించాం. వాటికి తాళాలు వేసి అత్యవసర సమయాల్లో తెరిచి ప్రథమ చికిత్స చేయాలి. ప్రతి నెలా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులను తనిఖీ చేసుకొని వాటిలో మందులు గడువు తీరితే వెంటనే వాటి స్థానంలో కొత్తవి ఉండాలి. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులను ప్రయాణికులకు ఉపయోగపడేలా నిర్వహిస్తాం. ఈ విషయంలో డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి.

– జగదీష్‌, డీపీటీఓ, చిత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం1
1/6

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం2
2/6

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం3
3/6

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం4
4/6

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం5
5/6

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం6
6/6

ఫస్ట్‌ఎయిడ్‌ నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement